Akhanda 2: సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ సూపర్ హిట్గానే నిలుస్తూ ఉంటాయి. వారిద్దరి కాంబినేషన్లో సినిమాలు వచ్చాయి అంటే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగాల్సిందే. అలాంటి సెలబ్రిటీల జాబితాలలో బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ ఒకటని చెప్పాలి. బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో ఇప్పటివరకు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ మూడు సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.
వీరిద్దరి కాంబినేషన్లో మొదటగా సింహం, లెజెండ్ అఖండ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ సినిమాలు మంచి సక్సెస్ అవడంతో తిరిగి వీరిద్దరి కాంబినేషన్లో అఖండ సీక్వెల్ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెల్లడించారు. అంతేకాకుండా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.
ఇక బాలకృష్ణ ప్రస్తుతం బాబి డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే బాలయ్య బోయపాటి సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అఖండ 2 సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.
బోయపాటి ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ గా ఓ కత్తిలాంటి ఫిగర్ ని ఎంపిక చేశారని సమాచారం. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ ను బోయపాటి రంగంలోకి దిప్పుతున్నారు. మరి బాలయ్య నటించబోయే ఈ సినిమాల్లో చాన్స్ అందుకోబోతున్న ఆ బ్యూటీ ఎవరు అనే విషయానికొస్తే ఆమె మరెవరో కాదు.. నటి కత్రినా కైఫ్ అని సమాచారం.
అల్లరి పిడుగు…
కత్రినా కైఫ్ బాలకృష్ణ గత 20 సంవత్సరాల క్రితం అల్లరి పిడుగు సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా 20 సంవత్సరాలు తర్వాత తిరిగి మరోసారి వీరిద్దరూ జంటగా కనిపించబోతున్నారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు ఏది ఏమైనా ఈ సినిమా విషయంలో బోయపాటి ప్లానింగ్స్ మామూలుగా లేవని చెప్పాలి. ఇక ఈ సినిమాకు నిర్మాతగా బాలకృష్ణ కుమార్తె తేజస్విని వ్యవహరించడం విశేషం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…