Rana -Mihika: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ సినీ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటుడు రానా. లీడర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా వచ్చిన ఈయన అనంతరం పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ఇక బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందారు. ఈ సినిమాలో విలన్ గా నటించిన రానా అనంతరం భీమ్లా నాయక్ సినిమా ద్వారా కూడా విలన్ పాత్రలో నటించి మెప్పించారు.
ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా ఈయన వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉన్నారు. రానా గత నాలుగు సంవత్సరాల క్రితం మిహిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరిది ప్రేమ వివాహం అని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ కేవలం మిహికను చూసిన వారం రోజుల్లోనే తనని పెళ్లి చేసుకున్నాను అంటూ రానా ఇటీవల వారి పెళ్లికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
కరోనా టైంలో హౌజ్ పార్టీ అనే యాప్ డౌన్లోడ్ చేశాను.. అందులో చాలా మందిని కలవచ్చు.. మనం మరి కొంతమందిని యాడ్ చేయవచ్చు… అలా సర్కిల్ పెరుగుతుంది.. ఇలా చాలా కాలం క్రితం నేను చూసిన ఒక వ్యక్తిని మళ్లీ ఈ యాప్ ద్వారా కలిసాను. ఇలా యాప్ ద్వారా మిహికను చూడటమే కాకుండా తనకు ప్రపోజ్ చేశానని రానా తెలిపారు. తాను ప్రపోజ్ చేయడంతో మిహిక సరదాగా చెబుతున్నానని భావించిందట కానీ తరువాత నా గురించి ఎంక్వైరీ చేయగా మంచోడిని అని తెలిసి పెళ్లికి ఒప్పుకుందని రానా తెలిపారు.
సినిమా చేస్తే బ్లాక్ బస్టరే…
ఇలా ఒక యాప్ ద్వారా పరిచయం అయ్యి పరిచయమైన వారం రోజులలోనే పెళ్లి చేసుకుని ఇలా సంతోషంగా ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఇలా రానా పెళ్లి వెనుక ఉన్న ఈ స్టోరీ తెలియడంతో అచ్చం సినిమాని తలపిస్తుందని సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…