నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ఎంతోమంది నటీనటులలో బాలీవుడ్ నటి రాధిక ఆప్టే ఒకరు. ఈ సినిమాలో గ్లామర్ డోస్ ను పెంచాలన్న…సోషల్ మీడియా వేదికగా కాంట్రవర్సీలు చేయాలన్న అది కేవలం రాధిక ఆప్టేకి మాత్రమే చెందుతుందని చెప్పవచ్చు. తాజాగా రాధిక ఆప్టే నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. అయితే అందుకు గల కారణం ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు కాదు, ఆమె నటించిన సినిమాలు కూడా కాదు. అయినప్పటికీ నెటిజన్లు ఆమెపై ఎందుకు అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే విషయానికి వస్తే…
గత కొద్దిరోజుల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో నటి శిల్పాశెట్టి భర్త,ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. రాజ్ కుంద్రా కొందరు నటీమణులతో బలవంతంగా పోర్న్ వీడియోలు చేయిస్తూ అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారనే ఆరోపణలు రావడం చేత పోలీసులు అతనిని కస్టడీలోకి తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ప్రస్తుతం రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు నటిరాధిక ఆప్టే కు చుట్టుకుందని చెప్పవచ్చు. గతంలో మీటూ ఉద్యమం తలెత్తినప్పుడు ఆ ఉద్యమం గురించి ఎంతో బహిరంగంగా స్పందిస్తూ మాట్లాడిన నటీమణులు రాజ్ కుంద్రా విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా నటి రాధిక ఆప్టే ను టార్గెట్ చేస్తూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఈమె చేసిన గ్లామరస్ పాత్ర లను తప్పుబడుతూ #BoycottRadhikaApte ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదం పై బ్యూటీ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…