కిడ్నీలో రాళ్లు ఏర్పడిన సందర్భంలో మూత్ర విసర్జన చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మన పెద్దలు కూడా ఎక్కువగా నీళ్లను తాగితే రాళ్లు కరిగిపోయి మూత్రం ద్వారా బయటకు వస్తాయని చెబుతుంటారు. అయితే ప్రస్తుతం ఈ రాళ్లు అనేవి వయసుతో పనిలేకుండా ఏర్పడుతున్నాయి.
బ్లడ్ లో ఎక్కువ కాల్షియం ఉండడం లేదా పాలకూర, నట్స్, చాకొలేట్ వంటి ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ని తీసుకోవడం, తగినంత నీరు తాగకపోవడం, అధిక బరువుని కలిగి ఉండడం వంటి అనేక కారణాల కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు.
కాబట్టి దీని లక్షణాలను ముందే కనుగొన్నప్పుడే, వీలైనంత త్వరగా డాక్టరుని సంప్రదించడం మంచిది. కానీ, ఈ సమస్యకు కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల సమస్య తగ్గడమే కాకుండా.. రాళ్లు త్వరగా పోతాయని చెబుతున్నారు నిపుణులు.. వాటి గురించి తెలుసుకుందాం. సాధారణంగా మూత్రపిండాల లోపలి పొరలో పేరుకున్న ఖనిజాలు కిడ్నీలో రాళ్ళుగా మారుతాయి. కిడ్నీలో రాళ్ళు సాధారణంగా కాల్షియం ఆక్సలేట్‌తో తయారవుతాయి.
ఈ రాళ్ళు చిన్నవిగా ఉన్నందున, గుర్తించడానికి అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలలో.. అవి శరీరాన్ని విడిచి మూత్రం ద్వారా విడుదల అవుతున్నప్పుడు అవి నొప్పిని కలిగిస్తాయి. వాటిని కరిగించాలంటే ప్రతీ రోజు ఒక స్పూన్ నిమ్మ రసం, తేనె మిశ్రమాన్ని కలిపి తీసుకోవాలి. పుచ్చకాయ జ్యూస్ తాగడం వల్ల కూడా రాళ్లు కరిగిపోయే అవకాశం ఉంటుంది.
నిమ్మరసం, నీరు కలిపిన మిశ్రమంలో కొద్దిగా బెల్లం లేదా తేనె కలుపుకొని ఉదయం సాయంత్రం తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయట. వారంలో ఒక రోజు దానిమ్మ జ్యూస్ తాగితే మంచిదని నిపుణుల అభిప్రాయం. ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ తో పాటు ఇతర వ్యర్ధాలు కూడా తొలగిపోతాయి. అలోవేర జ్యూస్ తాగితే మూత్ర పిండాల్లో రాళ్ళు ఏర్పడవని చెబుతున్నారు నిపుణులు. కొత్తి మీర రసం కూడా తీసుకుంటే కడ్నీలోని రాళ్లు కరిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…