బాలీవుడ్ ప్రేమపక్షులుగా ఉన్నటువంటి అలియాభట్ రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇద్దరు స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతూ ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ జంట గత కొద్ది సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోని ఈ జంట ఎక్కడ కనిపించినా వీరి ఫోటోలు పెద్దఎత్తున వైరల్ గా మారుతుంటాయి.
ఇకపోతే ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపించినప్పటికీ వీరు మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయితే వచ్చే ఏడాది ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బీ టౌన్ లో చక్కర్లు కొడుతుంది. ఇకపోతే దీపావళి సందర్భంగా ఈ జంట ఫోటో సెషన్ నిర్వహించుకున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా రణబీర్ కపూర్ ఎంతో అందంగా ముస్తాబయ్యాడు. నీలి రంగు లెహంగా ధరించిన అలియాభట్ నవ్వులు కురిపిస్తూ ఉన్నప్పటికీ, రణబీర్ మాత్రం కాస్త చిరాకుగా ఉన్నట్లు కనబడుతోంది.
ఇక వీరిద్దరూ మెట్లు దిగి వస్తూ ఉండగా అలియా లెహంగా నేలను ఈడుస్తూ ఉండటంతో వెనక నుంచి రణబీర్ కపూర్ ఏకంగా కాలితో ఆమె డ్రెస్సును తన్నారు.దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. రణబీర్ తన ప్రేయసి డ్రెస్సును ఇలా తన్నడం ఏమాత్రం సవ్యంగా లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…