Brahmaji: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా,విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న కమెడియన్ బ్రహ్మాజీ గురించి అందరికీ సుపరిచితమే. ఈయన ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలో నటించారు. అదేవిధంగా మరికొన్ని సినిమాలలో కామెడీ పాత్రల ద్వారా ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేశారు.
ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న బ్రహ్మాజీ సినీ కెరియర్ గురించి అందరికీ తెలిసిందే.అయితే ఈయన వ్యక్తిగత విషయాలు కనుక తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోవాల్సిందే. అయితే కొద్ది రోజులుగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బ్రహ్మాజీ తన వ్యక్తిగత విషయాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
తన తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి అని సినిమాలపై మక్కువ ఉండటంతో కే విశ్వనాథ దర్శకత్వంలో పలు సినిమాలలో నటించారు. ఈ విధంగా తనకు కూడా చిన్నప్పటి నుంచి సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండడంతో చెన్నై వెళ్లి ఫిలిమ్ ఇన్స్టిట్యూట్లో చేరానని తెలిపారు. అయితే అక్కడ తనకు ఒక బెంగాలీ అమ్మాయితో పరిచయం ఏర్పడిందని బ్రహ్మాజీ తెలిపారు.ఇక ఆమెకు అప్పటికే పెళ్లి అయ్యి ఒక కుమారుడు కూడా ఉన్నారని అయితే భర్తతో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారని ఈయన తెలిపారు.
ఇక తన ప్రేమలో పడినటువంటి బ్రహ్మాజీ ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేసి వారి సమక్షంలోనే పెళ్లయిన మహిళను వివాహం చేసుకున్నారు.ఇక అప్పటికే తనకు కొడుకు ఉండడంతో తను కూడా పిల్లల్ని కంటే పిల్లలను సమానంగా పెంచలేనని ఇద్దరి మధ్య వ్యత్యాసాలు రావడంతో తన భార్య బాధపడుతుందన్న కారణంతోనే బ్రహ్మాజీ పిల్లలు వద్దనుకున్నారని ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…