Brahmanandam: టాలీవుడ్ స్టార్ కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమెడియన్ గా ఎన్నో వందల సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన ప్రస్తుతం కాస్త సినిమాలను తగ్గించారనే చెప్పాలి. ఇక బ్రహ్మానందం గారికి ఇద్దరు సంతానం అనే విషయం మనకు తెలిసిందే.
వీరి పెద్ద కుమారుడు గౌతమ్ ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటించారు. అయితే ఈయన ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు చిన్న కుమారుడు సిద్ధార్థ్. ఈయన ఉద్యోగ నిమిత్తం విదేశాలలో స్థిరపడ్డారు. అయితే తాజాగా తన చిన్న కుమారుడికి బ్రహ్మానందం ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరిపిన సంగతి మనకు తెలిసిందే.
బ్రహ్మానందం తన కుమారుడు సిద్ధార్థ్ కు ఐశ్వర్య అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బ్రహ్మానందం చిన్న కోడలు ఐశ్వర్య గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. దీంతో ఈమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఐశ్వర్య కరీంనగర్ కు చెందిన ప్రముఖ డాక్టర్ పద్మజా వినయ్ గారి కుమార్తె. కరీంనగర్ లో పద్మజ సంతాన సాఫల్య కేంద్రం ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచింది. ఇలా పద్మజ వినయ్ గారి ఏకైక కుమార్తె ఐశ్వర్య కూడా ప్రముఖ గైనకాలజిస్ట్ కావడం విశేషం.ఇలా డాక్టర్ అయినటువంటి అమ్మాయిని బ్రహ్మానందం తన కోడలుగా చేసుకుంటున్నారు. ఇక ఈమె పేరిట తమ తల్లిదండ్రులు భారీగానే ఆస్తులను పోగు చేశారని తెలుస్తోంది. ఏది ఏమైనా బ్రహ్మానందం బడా ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని తన కోడలుగా తీసుకొచ్చారని తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…