Brahmanandam: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో కమెడియన్ గా తన హాస్యంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హాస్యనటుడు బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే.తన సినీ కెరియర్లో వందల సినిమాలలో నటించిన బ్రహ్మానందం ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరమయ్యారు.
ఇక తాజాగా ఈయన పంచతంత్రం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇకపోతే చెడ్డి గ్యాంగ్ తమాషా అనే సినిమా త్వరలోనే విడుదల కానుంది ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం పాల్గొని ఆయన చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మానందం మాట్లాడుతూ హాస్య సినిమాలను బతికించాలని తన గురువుగారు జంధ్యాల ఎప్పుడు చెప్పేవారు. అందుకే తాను కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చానని బ్రహ్మానందం తెలిపారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలియజేశారు.
ఇక ఇండస్ట్రీ గురించి ఇండస్ట్రీలో సినిమాల గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలకు ఒక ప్రాధాన్యత, చిన్న సినిమాలకు తక్కువ ప్రాధాన్యత ఉంటుందని చాలా మంది భావిస్తారు. అయితే ఇలాంటి వ్యత్యాసాలు ఇండస్ట్రీలో ఎప్పుడు లేవని చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సందర్భంగా మరోసారి బ్రహ్మానందం చిత్రపరిశ్రమ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…