Adi Reddy: బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లినటువంటి ఆదిరెడ్డి గురించి పరిచయం అవసరం లేదు. ఈయన కామన్ మ్యాన్ క్యాటగిరిలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఒక కామన్ మ్యాన్ గా ఉన్నటువంటి ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చేవారు.ఇలా బిగ్ బాస్ రివ్యూయర్ గా గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఏకంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లారు.
బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లిన ఆదిరెడ్డి ఎంతో నిజాయితీగా ఆట ఆడుతూ తప్పొప్పులను ఒప్పుకొని టాప్ ఫోర్ కంటెంట్ గా నిలిచారు. ఈ క్రమంలోనే బయటకు వచ్చిన ఈయన తాను కప్పు గెలుచుకోలేదన్న బాధ తనలో ఏమాత్రం లేదని టాప్ ఫోర్ వరకు నన్ను తీసుకువెళ్లిన అభిమానులకు ప్రేక్షకులకు తాను ఎప్పుడు రుణపడి ఉంటానని తెలిపారు.
ఇలా బిగ్ బాస్ ద్వారా మరింతమంది అభిమానులను సొంతం చేసుకున్న ఆదిరెడ్డి రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం చర్చలు మొదలయ్యాయి.ఇక ఈయన యూట్యూబ్ ద్వారా నెలకు భారీగా సంపాదిస్తున్నారని ఒక హీరోయిన్ సినిమాకు తీసుకునే అంత రెమ్యూనరేషన్ తాను నెల రోజులలోనే సంపాదిస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి.
ఈ క్రమంలోనే బయట ఈ స్థాయిలో డబ్బు సంపాదిస్తున్న ఆదిరెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది అయితే బిగ్ బాస్ నిర్వాహకులు కూడా తన ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని తనకు రెమ్యూనరేషన్ ఇచ్చి ఉంటారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఆదిరెడ్డి రోజుకు లక్ష రూపాయలు అటూ ఇటూగా రెమ్యూనరేషన్ అందుకొని 15 వారాలకు గాను ఈయన 12 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం. ఒక కామన్ మ్యాన్ గా ఉన్నటువంటి ఆదిరెడ్డి సెలబ్రిటీ హోదా అందుకోవడం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…