Breaking News: టాలీవుడ్ సూపర్ స్టార్ సీనియర్ నటుడు కృష్ణ నేడు తుది విశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణ ఆదివారం తీవ్రమైన అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతనిని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు.
ఈయనకు గుండెపోటు రావడంతో కాంటినెంటల్ వైద్యులు ఆయనను వెంటిలెటర్ పై ఉంచి చికిత్స అందించారు. అయితే 24 గంటలు గడిస్తే కానీ ఆరోగ్య పరిస్థితి గురించి ఏ విషయం చెప్పలేమని చెప్పిన డాక్టర్లు ఈయనను అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స అందించారు. ఇక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు తెల్లవారుజామున నాలుగు గంటలకు తుది శ్వాస విడిచారు.
ఇలా అనారోగ్య సమస్యలతో కృష్ణ మరణించడంతో మహేష్ బాబు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక ఈ విషయం తెలిసినటువంటి సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా కాంటినెంటల్ హాస్పిటల్ కి చేరుకుంటున్నారు.ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత కృష్ణ గారికి ఉందని చెప్పాలి.
Breaking News:
ఇలా ఐదు దశాబ్దాల సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కృష్ణ ఇక లేరని తెలియడంతో ఎంతో మంది అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…