Featured

DAV school issue : డిఏవి స్కూల్ ఘటన జరిగి రెండు నెలలు దాటినా ఫోరెన్సిక్ రిపోర్ట్ బయటపెట్టకుండా నిందితుడిని శిక్ష నుండి తప్పిస్తున్నారా?? పేరెంట్స్ కి న్యాయం జరిగేది ఎవుడు…?

DAV school issue : నాలుగేళ్ళ చిన్నారి మీద జరిగిన అత్యాచారం ఘటనతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. డిఏవి పబ్లిక్ స్కూల్ లో ఎల్కేజీ పాపను ఆ స్కూల్ డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపింది. రెండు నెలలుగా పాపను బెదిరించి అత్యాచారం చేసినట్లుగా ప్రాథమిక విచారణలో తెలియగా డ్రైవర్ ను అలాగే స్కూల్ ప్రిన్సిపాల్ మాధవిను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఇక స్కూల్ గుర్తింపు రద్దు చేస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంధ్రారెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఘటనలో పాప కుటుంబానికి ఏ మాత్రం న్యాయం జరగక మునుపే మళ్ళీ స్కూల్ ను రీ ఓఎన్ చేసారు. యధాతతంగా తరగతులు నిర్వహిస్తుండటంతో పాప తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగినా ఇప్పటి వరకు ఫలితం కనిపించలేదు.

రెండు నెలలు గడిచినా న్యాయం ఏది…

ఘటన జరిగి రెండు నెలలు గడిచినా ఇంకా కేసు అసలు ముందుకు జరగలేదు. ఇప్పటివరకూ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కూడా బయటికి రాలేదు నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతోంది అంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక స్కూల్ గుర్తింపు రద్దు చేస్తామని చెప్పి మళ్ళీ స్కూల్ యాదవిధంగా తెరవడం తరగతులను నిర్వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. పాఠశాలలో చదువుతున్న మిగిలిన పిల్లల తల్లిదండ్రులు కూడా కొంచెం ఆలోచిస్తే బాగుండేది, వారి పిల్లలు చదువు వరకే ఆలోచించారు.

మరికొంతమందేమో స్కూల్ పరువు తీయడానికి కావాలనే ఇలా చేస్తున్నారంటూ వ్యతిరేక ఆరోపణలు చేసారు. ఇండియాలో కూడా అరబ్ దేశాల్లో ఉండే లాంటి కఠిన చట్టాలు ఉండాలి అంటూ పలువురు అభిప్రాయపడ్డారు. తాలిబన్లు చెప్పి ఆడవారి మీద అత్యాచారం చేస్తున్నారు. ఇలాంటి మృగాలు చెప్పకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు అంతే ఇద్దరికీ పెద్ద తేడాలేదు అంటూ ఫైర్ అయ్యారు. నేడు చిల్డ్రన్స్ డే సందర్బంగా మరి ఆ పాప మీద జరిగిన ఘోరం ఇంక ఏ పిల్లకూ జరగకుండా ఉండేలా వాడికి సహకరించిన ప్రిన్సిపాల్ కు శిక్షపడాలి అంటూ పలువురు అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago