Bigg Boss 5: దీప్తితో బ్రేకప్..అనంతరం షన్ను మొదటి పోస్ట్..భావోద్వేగంతో ఇలా!
Bigg Boss 5: అందరూ ఊహించినట్లే జరిగింది. బిగ్ బాస్ తరువాత షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునయనలు తమ రిలేషన్ షిప్ కు బ్రేకప్ చెప్పుకున్నారు. బిగ్ బాస్ ముగిసిన తర్వాత వీరిద్దరి మధ్య బంధం దెబ్బతిందని.. అనుకుంటున్న తరుణంలో దీప్తి సునయన బ్రేకప్ విషయాన్ని ప్రకటిచింది.
బిగ్ బాస్ 5 సీజన్ లో సిరి- షణ్మఖ్ మధ్య రొమాన్స్ పీక్స్ కు చేరింది. ముద్దులు, కౌగిలించుకోవడాలతో పాటు ఒకే బెడ్ పై పడుకోవడం చాలా మంది జనాలకు రుచించలేదు. ఇదే విషయంపై సిరి తల్లి కూడా నెగిటివ్ గానే స్పందించింది. అయితే మేం ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెబుతున్నప్పటికీ వీరిద్దరి తీరు చూస్తే మాత్రం అలా అనిపించలేదు.
బిగ్ బాస్ పెట్టిన ఫిటింగ్ కు దీప్తి సునయన- షణ్ముఖ్ జశ్వంత్ తమ ఐదేళ్ల లవ్ కు ఫుల్ స్టాఫ్ పడింది. తాజాగా న్యూఇయర్ కు ఒక రోజు ముందు దీప్తి సునయన.. చాలా ఎమోషనల్ తో ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. తమ దారులు వెరని చెబుతూ.. ఎమోషనల్ అయింది.
బ్రేకప్ చెబుతున్న సమయంలో దీప్తి సునయనలో భావోద్వేగం కొట్టొచ్చినట్లు కనిపిచింది. తాజాగా దీప్తి సునయన పోస్ట్ పై షణ్ముఖ్ స్పందించాడు. ఇందులో రెండు హార్ట్ సింబల్స్‌ను షేర్ చేశాడు. గుండె బద్దలైందన్నట్టుగా ఓ రెండు బ్రోకెన్ హార్ట్ సింబల్‌లను షేర్ చేశాడు. దీప్తి ఏ నిర్ణయం తీసుకున్నా.. సంతోషంగా ఉంటే చాలు.. తాము మంచి స్నేహితులుగా ఉంటాం అంటూ పోస్ట్ పెట్టాడు. ఇదిలా ఉంటే శ్రీహాన్ కూడా సిరికి దూరంగా ఉంటున్నాడు. బిగ్ బాస్ హౌజ్ నుంచి వచ్చిన తర్వాత సిరిని కలిసేందుకు ప్రయత్నించలేదు. దీంతో వీరిద్దరి మధ్య కూడా రిలేషన్ దెబ్బతిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బిగ్ బాస్ దెబ్బకు రెండు జంటలు మధ్య రిలేషన్ చెడిపోయింది
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…