పెళ్లంటే ఒకప్పుడు పంతులు చెప్పింది చేసేవాళ్లు. అతడు ముహూర్తం ఎప్పుడు పెడితే అప్పుడు బాజాభజంత్రీలు వినిపిస్తాయి. కానీ ఇదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. వివాహం అయిన తర్వాత వధూవరులకు కొత్త కొత్త ఛాలెంజ్ లు.. టాస్కులు ఫ్రెండ్స్ చుట్టూ చేరి ఇస్తున్నారు. ఆ జంటకు ఇష్టం ఉన్నా.. లేకున్నా.. ఆ పోటీలో పాల్గొంటూ ఆనందాలను పంచుకుంటారు.
అయితే సాధారణంగా ఏ దంపతుల మధ్య అయినా చిన్న పాటి గొడవలు రావడం.. మళ్లీ అవి సర్దుకోవడం జరుగుతుంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకొని ముంబైలో జరిగిన ఆ పెళ్లిలో… వధూవరులకు చిన్న ఛాలెంజ్ పెట్టారు వాళ్ల స్నేహితుతు. ఆ ఛాలెంజ్ ఏంటంటే.. నేలపై ఓ కర్చీఫ్ ఉంచి ఇద్దర్లో ఎవరు దాన్ని దక్కించుకుంటారో వారే విన్నర్స్ అంటూ చెప్పారు.
ఛాలెంజ్ స్వీకరించిన వధూవరులు.. ఒకేసారి కర్చీఫ్ పట్టుకున్నారు. వధువేమో కర్చీఫ్ లాక్కునేందుకు ప్రయత్నించగా… వరుడు ఒక్కసారిగా తన వైపు లాక్కుంటుండగా.. రెండువైపులా ఫ్రెండ్స్ చేరి… వదలొద్దు… వదలొద్దు అని అటు వధువుకూ, ఇటు వరుడికీ చెబుతూ ఎంకరేజ్ చేశారు. ఈ గేమ్ ఎప్పటికీ చివరకు చేరదని గ్రహించిన వరుడు ఆమెను ఎత్తుకొని వెళ్లి పక్కనే ఉన్న ఫ్యాన్ దగ్గర దించాడు.
దాంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో విటి వెడ్డింగ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ సంస్థ వెడ్డింగ్స్ జరిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫన్నీ కామెంట్లు పెడుతూ ‘హ్యాపీ వెడ్డింగ్ ’ అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు. ఈ వీడియో ప్రతీ ఒక్కరు విపరీతంగా షేర్ చేస్తున్నారు.
తిరుమలలో వైద్య సేవ చేయాలనుకునే వారికి మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. Tirumala Tirupati Devasthanams (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న…
అమ్మాయిల్లో చాలామందికి జుట్టు సరిగ్గా పెరగడం లేదనే ఆందోళన ఉంటుంది. పల్చగా, బలహీనంగా మారిన జుట్టు వల్ల చాలా మంది…
గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని బయటకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మెట్ల దగ్గర వదిలిన చెప్పులు కనిపించకపోతే…
దేశంలో కుంభమేళా అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్. అక్కడ జరిగే మహాకుంభమే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. కానీ…
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…