Britney Spears : సాధారణంగా మనం సినిమా లో పెళ్లి సన్నివేశం జరుగుతుంటే ఊహించే సీన్ ఒక్కటే ఎవరో ఒకరు వచ్చి ఆపండి… ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు అనే డైలాగు. ఎన్ని సినిమాల్లో చూడలేదు ఇలాంటివి అనుకుంటున్నారా. సినిమాల్లో కామనే గాని నిజంగా ఇలా జరిగితే.. కొన్నిసార్లు సాధారణ పెళ్లిళ్లలో కూడా ఇలా జరుగుతుంటాయి, అవి సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతుంటాయి. ఇక ఇలాంటి ఒక సంఘటన ఒక ఫేమస్ సెలబ్రిటీ కి ఎదురైతే ఎలా ఉంటుంది, ఇది కొంచెం కష్టమే. సెలబ్రిటీలు వాళ్ళ పెళ్లిళ్లు జరిగేటప్పుడు చాలా జాగ్రత్త పడతారు అలాగే గట్టి భద్రత ఏర్పాట్లు కూడా చేసుకుంటారు. కాబట్టి అలాంటి సంఘటనలకు ఆస్కారం లేదు కానీ ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పీర్ పెళ్లి విషయంలో ఇలాంటి ఘటనే జరిగింది.
ఆపండి ఈ పెళ్లి అన్న మాజీ భర్త, అదుపులోకి తీసుకున్న పోలీసులు….
బ్రిట్నీ స్పీర్ పాప్ సింగర్ గా అందరికి పరిచయమే. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఆమె సొంతం. అమెరికన్ పాప్ సింగర్ అయిన బ్రిట్నీ ప్రిన్సెస్ అఫ్ పాప్ గా పేరు తెచ్చుకుంది. 1990-2000 సమయంలో ఆమె ఆల్బమ్స్ కుర్రకారుకి పిచ్చెక్కించాయి. అమెరికన్ బిల్ బోర్డు చార్ట్ లిస్ట్ లో టాప్ 100 లో చోటు సంపాదించుకుని ఆమెకు మంచి పాపులారిటీ ని అందించాయి. బేబీ వన్ మోర్ టైం, ఊప్స్ ఐ డిడ్ ఇట్ అగైన్ ఆల్బమ్స్ ఆమె 15 ఏళ్ల వయసులోనే అత్యధిక మంది విన్న ఆల్బమ్స్ గా రికార్డు సాధించాయి. అలాగే బేబీ వన్ మోర్ టైం ఆల్బమ్ కి గ్రామీ అవార్డు వచ్చింది. ఇక బ్రిట్నీ 2004 లో జాసన్ అల్లేన్ అలెగ్జాండర్ ను పెళ్లి చేసుకుంది. అయితే 55 గంటల్లోనే వారు విడిపోయారు కూడా. ఇక ఆతరువాత అదే సంవత్సరం కెవిన్ ఫెడర్లిన్ అనే డాన్సర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఇక వీరికి ఇద్దరు మగపిల్లలు, కానీ ఈ వివాహం సజావుగా సాగలేదు ఇక కెవిన్ తో 2007 లో విడిపోవాలని నిర్ణయించుకుంది. ఇక పిల్లలను ఇద్దరి సంరక్షణలో ఉంచాలానే ఒప్పందం పై విడిపోయారు. ఇక తనకున్న మానసిక ఆరోగ్య సమస్యల వల్ల తన తండ్రి సంరక్షణలోనే ఉన్న బ్రిట్నీ వివాహానికి దూరంగా ఉంది. ఇక ఈ సమయంలోనే బ్రిట్నీ, అస్ఘరీ అనే పర్సనల్ ట్రైనర్ తో ప్రేమలో పడింది. తాజాగా వీరి వివాహం అత్యంత రహస్యంగా చేసుకోవాలనుకున్నా మొదటి భర్త అలెగ్జాండర్ వచ్చి రచ్చ చేసాడు. నాకున్న ఒకే భార్య అంటూ వేదిక వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేసాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…