Categories: FeaturedMovie News

Justin Bieber : పాప్ గాయకుడికి ఫేసియల్ పెరాలసిస్.. సోషల్ మీడియాలో వీడియో… ఎప్పటికి కోలుకొంటానో తెలియదు…!

Justin Bieber : పాప్ సంగీతం ప్రపంచంలో అతి చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులతో క్రేజ్ తెచ్చుకున్న సింగర్ జస్టిన్ బీబర్. బేబీ బేబీ అంటూ పాడిన పాట వరల్డ్ మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నాడు. ఇక ప్రతి ఆల్బమ్ తో తన అభిమానులను రెట్టింపు చేసుకున్న ఈ యువ కెరటం అంతే వివాదాల్లోను చిక్కుకున్నాడు. ఇక కెరీర్ ముగిసిపోయింది అనే లోపే మళ్ళీ పడి లేచిన కెరటం లాగా లేచాడు జస్టిన్. పెళ్లి చేసుకుని సాఫీగా తన కెరీర్ ను కొనసాగిస్తున్న జస్టిన్ వరల్డ్ టూర్ ప్రారంభించాడు. కానీ ఆ పర్యటనను ప్రస్తుతం రద్దు చేసాడు. జస్టిన్ ఫేసియల్ పెరాలసిస్ తో బాధపడుతున్నట్లు వీడియో ద్వారా స్వయంగా తానే అభిమానులకు చెప్పారు.

రామ్సే హంట్ సిండ్రోమ్ వల్ల ఫేసియల్ పెరాలసిస్….

తన ముఖంలోని కుడి భాగం కదపలేక పోతున్నట్లు తెలిపాడు. రామ్సే హంట్ సిండ్రోమ్ అనే వైరస్ తన చెవుల నరాల ద్వారా సోకడం వల్ల పక్షవాతం వచ్చినట్లు తెలిపాడు. వీడియోలో చూపిస్తూ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. మీకు కనిపిస్తోంది కదా, ఈ కన్నుకొట్టడానికి రావడం లేదు ముఖంలో ఈ వైపు నవ్వలేకపోతున్నాను. నా ముఖం మీద ఈ పక్క పూర్తి పక్షవాతం వచ్చింది అని వీడియో లో చూపిస్తూ చెప్పారు. నా చెవిలోని నరం మీద, నా ముఖపు నరాల మీద ఈ వైరస్ దాడి వల్ల నా ముఖానికి పక్షవాతం సోకింది అంటూ తన ముఖంలోని కుడి పక్కను సూచిస్తూ ఆ వీడియోలో జస్టిన్ చెప్పారు. ఇది చాలా సీరియస్‌ ఇష్యూ. ఇలా అవ్వక పోయుంటే బాగుండేది. కానీ నేను కాస్త స్లో అవ్వాలని నా శరీరం చెప్తోంది. మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నా. ఈ సమయాన్ని విశ్రాంతి తీసుకోవటానికి ఉపయోగిస్తాను. నేను ఏ పని కోసం పుట్టానో ఆ పని చేయటం కోసం వంద శాతం కోలుకోవటానికి ప్రయత్నిస్తాను అని 24 కోట్ల మంది ఫాలోయర్స్ తో పంచుకున్నారు.

రామ్సే హంట్ సిండ్రోమ్ అనేది షింగ్లిస్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల చెవుల దగ్గర ఉండే ముఖ నరాలకు సోకి వచ్చే వ్యాధి. దీనివల్ల ముఖం లోని ఒకవైపు పక్షవాతానికి గురవుతుంది. ఇది కొంతమందిలో తాత్కాలికంగా ఉన్నా కొంతమందిలో తీవ్రతరం అవుతుంది. ఓ వైపు కన్ను కొట్టడానికి కూడా రాకపోవడం వల్ల కంటి నొప్పి ఎక్కువై చూపు మందగించే అవకాశం ఉందని అలాగే చెవి నరాలకు వైరస్ సోకడం వల్ల వినికిడి సమస్యలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. 60 ఏళ్లకు పైబడిన వారిలో ఈ వ్యాధి లక్షణాలు అధికంగా ఉంటాయి. కాగా జస్టిన్ వయసు ప్రస్తుతం 28 సంవత్సరాలు. ఇక జస్టిన్ భార్య హేలి బీబర్ కూడా గత మార్చిలో మెదడు లో రక్తం గడ్డకట్టడం వల్ల హాస్పిటల్ లో చేరారు. ఇక గుండెలో ఒక రంధ్రం మూసుకుపోవడం వల్ల సర్జరీ చేయించుకున్నారు. జస్టిన్ ప్రస్తుతం తన పాటల కచేరిలన్నింటిని రద్దు చేసారు. ఫేసియల్ ఎక్సర్సైజులు చేస్తున్నట్లు తగిన చికిత్స తీసుకుని తిరిగి మళ్ళీ అభిమానుల ముందుకు వస్తానని తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago