Chammak Chandra : జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయిన కమెడియన్స్ లో చమ్మక్ చంద్ర ఒకడు. మొగుడు పెళ్ళాం స్కిట్లు చేస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. నాగబాబు జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాక చమ్మక్ చంద్ర కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పాడు. ఇక జీ తెలుగు అదిరింది ప్రోగ్రామ్ ద్వారా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చినా అంతగా హిట్ కాలేదు. ఇక మా టీవిలో కామెడీ స్టార్స్ ధమాకా అంటూ జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
కామెడీ స్టార్స్ ధమాకా లో మెరిసిన కబాలి బ్యూటీ…..
ఇక కామెడీ స్టార్స్ ధమాకా లో చమ్మక్ చంద్ర, ధనరాజ్, వేణు, యాదమ్మ రాజు వంటి స్టార్ కమెడియన్స్ తో మంచి రేటింగ్స్ తెచ్చుకుంటోంది. టిక్ టాక్ వల్ల ఫేమస్ అయిన, ఢీ ఫేమ్ బ్యూటీ దీపికా పిల్లి హోస్ట్ గా నాగబాబు, శేఖర్ మాస్టర్ జడ్జెస్ గా ఈ షో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఇక ఈషో లో ఈ వారం ప్రోమో విడుదల చేసారు. అయితే అందులో అందరికన్నా చమ్మక్ చంద్ర స్కిట్ బాగా ఆకట్టుకుంది. ఎందుకంటే నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా పరదేశీ లో కీలక పాత్రలో నటించిన సాయి ధన్సిక చమ్మక్ చంద్ర స్కిట్ లో చేసింది. సాయి ధన్సిక పరదేశీ సినిమాలోనే కాదు కబాలి సినిమాలో రజనీకాంత్ కూతురిగా కూడా నటించారు. 12ఏళ్లుగా తమిళ ఇండస్ట్రీ లో పలు సినిమాలలో నటిస్తున్న ధన్సిక ఇటీవల తెలుగు సినిమా షికారు ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
కామెడీ స్టార్స్ ధమాకా ప్రోగ్రామ్ లో చమ్మక్ చంద్ర స్కిట్ లో నటించి అందరిని ఆశ్చర్య పరిచింది. అదికాక స్కిట్ లో తెలుగు రాకపోయినా సొంత డబ్బింగ్ కూడా చెప్పింది. సాధారణంగా చంద్ర స్కిట్స్ అంటే మొగుడు పెళ్ళాం మధ్యలో ఏ పక్కింటోడో దూరి పెళ్ళానికి లైన్ ఎయ్యడం లాంటివే ఉంటాయి. ఇక ఇపుడు కూడా అలాంటి స్కిట్స్ తోనే నవ్వించే ప్రయత్నం చేసాడు. ధన్సిక పోలీస్ భార్య గా చంద్ర పక్కింటి వాడిగా ధన్సిక కు లైన్ ఎయ్యడం స్కిట్లో చూపిస్తారు. ఏక ఎపిసోడ్ లో ఎలా నవ్వులు పూయించారో చూడాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…