Featured

BRS : ఆదిలోనే బొక్క బోర్లాపడిన బీఆర్ఎస్.. కేసీఆర్ ను చావు దెబ్బ కొట్టిన చవాన్.. ‘మహా’లో సీన్ రివర్స్..!

BRS : బీఆర్ఎస్ ను బలోపేతం చేసుకోవాలంటే ముందుగా గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టాలన్నది రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన సీఎం కేసీఆర్ ఆలోచన. తెలంగాణలో సైతం అలాగే చక్కబెట్టుకుంటూ వచ్చారు. ముందుగా మునిసిపాలిటీలో పోటీకి దిగి.. దానిని హస్తగతం చేసుకున్న మీదట రాష్ట్రంపై దృష్టి సారించారు. మహారాష్ట్రలో సైతం ఈ ఫార్ములా అమలు చేయాలని భావించారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో ఖాతా తెరిచేందుకు భోకర్‌ మార్కెట్‌ కమిటీ ఎన్నికలో పాల్గొన్నారు. ఇక్కడ ఖాతా ఓపెన్ చేయడం ద్వారా మహారాష్ట్రలో కొత్త పార్టీ తాలుకు సంకేతాలను అక్కడ ప్రభుత్వానికి తెలియజేయాలనుకున్నారు. పెద్ద ఎత్తున నేతలను సైతం ఆకర్షించి కండువాలు కప్పారు. ఇక ఇక్కడి ఎన్నికల్లో గెలిచేందుకు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేశారు. కానీ ఏ రాష్ట్రంలో అయినా ఒక సెంటిమెంట్ ఉంటుంది. పక్క రాష్ట్రానికి చెందిన నేతలను అంత త్వరగా అక్కున చేర్చుకునేందుకు ప్రజానీకం అంగీకరించదు. మహారాష్ట్రలోనూ ఇదే జరిగిందనుకుంటా.. వెరసి బీఆర్ఎస్ బొక్కబోర్లా పడింది.

కుట్టు మిషన్ గుర్తుతో ఎన్నికల బరిలోకి..

భోకర్‌ మార్కెట్‌ కమిటీలోని 18 డైరెక్టర్‌ పోస్టులకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ అసలు సోదిలో లేకుండా పోయింది. నిజానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని చాలా పట్టుదలతో ఉన్నారు. అక్కడి పరిస్థితులు ఆయన తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నారు. కుట్టు మిషన్ గుర్తుతో ఎన్నికల్లో దిగారు. సమావేశాలకు వస్తున్న ఆదరణ చూసి ఎన్నో కొన్ని పోస్టులను కైవసం చేసుకోవడం ఖాయమనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. కనీసం బీఆర్‌ఎస్‌ కీలక నేత, ఎమ్మెల్యే అభ్యర్థి నాగనాథ్‌ కూడా విజయం సాధించలేకపోయారు. 18 డైరెక్టర్ పోస్టులకు గానూ.. కాంగ్రెస్ 13, ఎన్సీపీ 2, బీజేపీ 3 డైరెక్టర్ పోస్టులను గెలుచుకుంది. బీఆర్ఎస్ మాత్రం పెద్ద ఎత్తున డబ్బు పంచినా కూడా ఖాతా తెరవలేకపోయింది. పోలైన ఓట్ల పరంగా చూస్తే కాంగ్రెస్‌కు 3,909, బీజేపీకి 2,106, బీఆర్ఎస్‌కు 1,153 ఓట్లు పోలయ్యాయి.

చావు దెబ్బ కొట్టిన అశోక్ చవాన్..

మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించకుండా అడ్డుకోవడంలో మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ప్రస్తుత భోకర్ ఎమ్మెల్యే అశోక్ చవాన్ కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్‌కు ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాకుండా అడ్డుకోగలిగారు. బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసిన కీలక నేత నాగనాథ్‌కు ఈ పార్టీ తరుఫున పోటీ చేసిన ఇతర అభ్యర్థుల కంటే కాస్త ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ ఏం లాభం? విజయం వరించలేదు. ప్రతి చోటా విజయం సాధించేందుకు అవకాశమున్న అభ్యర్థులను రంగంలోకి దింపారు. బీఆర్ఎస్ అమలు చేసిన ప్రతి ఒక్క ప్రయత్నాన్ని గట్టిగా తిప్పికొట్టారు. మొత్తానికి బీఆర్ఎస్‌ను అశోక్ చవాన్ చావు దెబ్బ కొట్టారు. మార్కెట్ కమిటీలో మొత్తం 18 డైరెక్టర్‌ పోస్టులకు గాను 11 డైరెక్టర్‌ పోస్టులకు రైతు సహకార సంఘాల ప్రతినిధులు, నాలుగింటికి గ్రామ పంచాయతీ ప్రతినిధనులు, రెండింటికి వ్యాపార సంఘాల ప్రతినిధులు, ఒక దానికి హమాలీ యూనియన్ ప్రతినిధులు ఓటు వేయాల్సి ఉంటుంది. వీటిలో దేనికి కూడా బీఆర్ఎస్ పార్టీకి కనీస మద్దతు లభించలేదు.

కొత్త సంస్కృతికి బాట వేసిన బీఆర్ఎస్..

మొత్తానికి బీఆర్ఎస్‌కు మహారాష్ట్రలో ఆదిలోనే హంసపాదు ఎదురైంది. తొలి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. మరి ఇకపై కేసీఆర్ దూకుడు పెంచుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒక్క సీటు గెలుచుకున్నా కూడా బీఆర్ఎస్ హవా మరోలా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మరోలా ఉంది. పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఫలితం దక్కలేదు. నిజానికి మహారాష్ట్ర ఎన్నికల్లో పెద్ద ఎత్తున నిధుల వరద పారిన ఘటనలు గతంలో ఎన్నడూ లేవట. ఈసారి ఈ కొత్త సంస్కృతికి బాట వేసింది మాత్రం బీఆర్ఎస్ అనే చెప్పాలి. బీఆర్ఎస్ పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెడుతుంటడంతో కాంగ్రెస్, బీజేపీలు సైతం నోట్లను బయటకు తీయాల్సి వచ్చింది. ఇంత చేసినా కేసీఆర్ ప్రయత్నాలేవీ వర్కవుట్ కాలేదు. వెరసి బీఆర్ఎస్ పార్టీ బొక్కబోర్లా పడింది. ఇక మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఇక మీదట ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago