Allari Naresh: టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ హీరోగా గుర్తింపు పొందిన అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నరేష్ ‘అల్లరి’ మూవీతో హీరోగా మారి హిట్టు కొట్టాడు. ఆ తర్వాత వరుసగా కామెడీ సినిమాలలో నటించి కామెడీ హీరోగా మంచి గుర్తింపు పొందాడు.
ఇలా దాదాపు 2012 వరకు వరుస విజయాలను అందుకున్న అల్లరి నరేష్ ఆ తర్వాత తొమ్మిదేళ్లపాటు వరుస పరాజయాలు చవిచూసి హీరోగా ఫేడ్ అవుట్ అయ్యే స్థాయికి వెళ్లిపోయాడు. దీంతో అల్లరి నరేష్ కెరీర్ ముగిసిపోయిందని విమర్శలు కూడా వినిపించాయి. అటువంటి తరుణంలో మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాలో మహేష్ బాబు స్నేహితుడు పాత్రలో నటించాడు.
ఆ తర్వాత నాంది సినిమాతో హీరోగా స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చి మళ్లీ నటుడిగా తన సత్తా నిరూపించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఉగ్రం సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా అల్లరి నరేష్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు.
తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లరి నరేష్ తన సినీ జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో నరేష్ పని అయిపోయినట్లు వినిపించిన వార్తల గురించి ప్రస్తావించగా.. అల్లరి నరేష్ స్పందిస్తూ “60 సినిమాలు చేశాను, 60 శుక్రవారాలు చూశాను, హీరోగా నా కెరీర్ గురించి చాలామంది చాలా మాటలు అన్నారు. వాళ్లందరూ ఏదో అంటేనే నా కెరియర్ అయిపోదు.. నేను చనిపోతేనే నా కెరీర్ అయిపోయినట్లు. అప్పటివరకు నేను సినిమాలు చేస్తుంటాను” అని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…