Niharika: నిహారిక కొణిదల పరిచయం అవసరం లేని పేరు మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి యాంకర్ గా ఈమె అడుగుపెట్టారు. ఇలా కెరీర్ మొదట్లో యాంకర్ గా కొనసాగిన నిహారిక అనంతరం హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా మెగా కాంపౌండ్ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి హీరోయిన్ నిహారిక అని చెప్పాలి అయితే హీరోయిన్ గా నిహారిక అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు.
ఇలా ఇండస్ట్రీలో నిహారిక సక్సెస్ కాకపోవడంతో ఈమె జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. అయితే ఈమె వివాహం తర్వాత తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ గతి కొద్ది రోజులుగా తన భర్త వెంకట చైతన్యతో తనకు మనస్పర్ధలు వచ్చాయని తెలుస్తోంది.ఇందుకు అనుగుణంగానే ఇద్దరు కూడా ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసుకోవడం ఫోటోలను డిలీట్ చేసుకోవడం జరిగింది.
నిహారిక వ్యక్తిగత విషయాల గురించి ఇలాంటి వార్తలు వస్తున్న తరుణంలో ఈ విషయాల గురించి మెగా ఫ్యామిలీ ఏ మాత్రం స్పందించలేదు అయితే నిహారిక మాత్రం ఈ విషయాలన్నింటినీ పక్కనపెట్టి పూర్తిగా తన వృత్తిపరమైన జీవితంపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోని హైదరాబాదులో తాజాగా ఆఫీస్ కూడా ఏర్పాటు చేసి సినిమాలు వెబ్ సిరీస్ కథలు వినే పనిలో బిజీ అయ్యారు. ఇలా నిహారిక తన వృత్తిపరమైన జీవితంలో ముందుకు సాగడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ విధంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్స్ స్థాపించి ఈమె నిర్మాణరంగంలో బిజీ అవుతున్నారు. అలాగే మరోవైపు భారీ స్థాయిలో వర్క్ అవుట్ చేస్తూ ఫిట్నెస్ కోసం కూడా కష్టపడుతున్నారు. ఇలా జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియోని నిహారిక షేర్ చేస్తూ కొన్ని హెల్త్ టిప్స్ తో పాటు మోటివేషనల్ టిప్స్ కూడా చేశారు. ఇందులో భాగంగానే మనకు తగిలిన గాయాలకు కాలమే మందు అంటూ ఒక కొటేషన్ చెప్పడంతో నిహారిక మనసు చాలా గాయపడిందని ఆ బాధ నుంచి బయటపడటం కోసమే ఇలా తన వృత్తిపరమైన జీవితంపై ఫోకస్ పెట్టారని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈమె చేసే సినిమాలు వెబ్ సిరీస్ లు సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…