Priyanka Chopra: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా ఆ తర్వాత హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన సత్తా చాటుతోంది. దీంతో ఈ అమ్మడు గ్లోబల్ బ్యూటీగా గుర్తింపు పొందింది. ఇక నిక్ జోనాస్ తో వివాహమైన తర్వాత హాలీవుడ్ సినిమాలకే పరిమితం అయ్యింది.
ఇది ఇలా ఉండగా ఈ అమ్మడు తరచూ గ్లామర్ తో అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది.తరచూ నేషనల్,
ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటూ సందడి చేస్తోంది.
తాజాగా జరిగిన ఆస్కార్ ఈవెంట్ లో కూడా సందడి చేసింది. ఇక తాజాగా న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో నిర్వహించిన 2023 మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్ లో మెరిసింది. ఈ ఈవెంట్ లో ప్రముఖ డిజైనర్ వాలెంటినో డిజైన్ చేసిన స్టైలిష్ బ్లాక్ గౌన్ లో మెరిసిపోయింది.
ఇక నిక్ జోనాస్ కూడా స్టైలిష్ గా అదిరిపోయే లుక్ తో స్టార్ జంటగా అందరినీ ఆకట్టుకున్నారు. వీరికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలలో ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. 2023 మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్ లో ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్ ధర ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఈ మెట్ గాలా ఈవెంట్లో ప్రియాంక చోప్రా బల్గారీకి చెందిన 11.6 క్యారెట్ డైమండ్ నెక్లెస్ ను ధరించింది. సాధారణంగా డైమండ్ జ్యువెలరీ విలువ ఎక్కువగానే ఉంటుంది. కానీ ప్రియాంక ధరించిన ఈ నెక్లెస్ ధర తెలిసి సెలబ్రిటీలు సైతం షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఈ నెక్లెస్ విలువ ఏకంగా రూ.204 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. దీంతో ప్రియాంక చోప్రా ధరించిన ఆ నెక్లెస్ ధర సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…