YSRCP Vs Rajni : వైసీపీ వర్సెస్ రజనీ ఎపిసోడ్‌లోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన సిల్క్ స్మిత.. ఇంతకీ ఆ చివరి లేఖ కథేంటి.. చంద్రబాబుకు ఫోన్..!

సూపర్‌స్టార్ రజనీకాంత్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సామాన్య కుటుంబంలో పుట్టి.. బస్సు కండక్టర్‌ నుంచి నటుడిగా ఎదిగి సూపర్‌స్టార్‌గా ఎదిగారు. అంచెలంచెలుగా శిఖరమంత ఎదిగినా ఒదిగి ఉన్న వ్యక్తి తలైవా. తెలుగు ప్రజలు మరీ ముఖ్యంగా ఏపీ ప్రజలతో రజనీకి మంచి సత్సంబంధాలే ఉన్నాయి. అయితే.. ఏపీలోని విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రజనీ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. కార్యక్రమంలో పాల్గొన్న తలైవా.. అన్నగారి గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడి వెళ్లిపోయుంటే సరిపోయేదే.. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు గురించి ఏ క్షణాన మాట్లాడారో ఇక ఒక్కసారిగా వైసీపీ నేతలు, కార్యకర్తలు మీడియా, సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ‘టార్గెట్ తలైవా’ విర్రవీగిపోతున్నారు. ఇప్పటి వరకూ పలు విషయాలను ప్రస్తావిస్తూ చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ వస్తున్నాయ్.. ఆఖరికి ఆయన్ను వ్యక్తిగతంగా, కుటుంబాన్ని సైతం టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. గత నాలుగైదు రోజులు ఈ వ్యవహారం నడుస్తుండగా ఎప్పుడెప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందా అనుకుంటున్న టైమ్‌లో సడన్‌గా వైసీపీ వర్సెస్ రజనీకాంత్ ఎపిసోడ్‌లోకి సిల్క్‌స్మిత, చంద్రబాబు ఎంటరయ్యారు. ఇంతకీ ఈ ఇద్దరూ ఎందుకొచ్చారు..? అసలు సిల్క్ స్మితకు రజనీకి ఏంటి సంబంధం..? చంద్రబాబు ఏమన్నారు..? చంద్రబాబుకు ఫోన్ చేసి తలైవా ఏమన్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

ఇదీ అసలు విషయం..
రజనీకాంత్ మాట్లాడింది నాలుగు మాటలు అయితే.. వైసీపీ మాత్రం ఆయన్ను లక్షల మాటలు ఎవరికి నోటికి వచ్చినట్లుగా వారు మాట్లాడారు. వైసీపీ నేతలు మొదలుకుని మంత్రులు, మాజీలు.. కార్యకర్తలు, వీరాభిమానులు నోరుపారేసుకున్నారు. ఆఖరికి మంత్రి రోజా సైతం రజనీని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం ఒకింత విస్మాయాన్ని కలిగించింది. ఇప్పటి వరకూ ఇలా విమర్శల వరకూ పరిమితమైన వైసీపీ బ్యాచ్ ఇప్పుడు ఏకంగా అక్రమ సంబంధాలు అంటగడుతూ కొన్ని లేఖలను వైరల్ చేస్తోంది. దివంగత నటి సిల్క్‌స్మిత ఆత్మహత్యకు రజనీకాంతే కారణమని అర్థం వచ్చేలా ఒక లేఖను సృష్టించిన వైసీపీ.. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ చేస్తున్నారు. ఈ లేఖలో అక్షరాలా అబద్ధం అయినప్పటికీ అబద్ధాన్నే పదే పదే ప్రచారం చేస్తూ నిజమని నమ్మించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో నిజమెంతో..!
సిల్క్‌స్మిత లేఖలోని విషయాలను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే అసలు విషయమేంటో మీకు తెలుస్తుంది.. అప్పుడిక మీరు వైసీపీ బ్యాచ్‌ను ఏం చేస్తారో ఇక మీ ఇష్టం. ‘ దేవుడా నా 7వ సంవత్సరం నుంచి పొట్టకూటి కోసం క‌ష్టప‌డ్డాను. న‌మ్మినవారే న‌న్ను మోసం చేశారు. నా వారంటూ ఎవ‌రూ లేరు. బాబు త‌ప్ప నాపై ఎవరూ ప్రేమ చూప‌లేదు. బాబు త‌ప్ప అందరూ నా క‌ష్టం తిన్నవారే. నా సొమ్ము తిన్నవారే నాకు మ‌న‌శ్శాంతి లేకుండా చేశారు. అంద‌రికీ మంచే చేశాను కానీ నాకు చెడు జ‌రిగింది. నా ఆస్తిలో ఉన్నదంతా బాబు కుటుంబానికి నా కుటుంబానికి పంచాలి. నా ఆశ‌ల‌న్నీ ఒక‌రిమీదే పెట్టుకున్నా…అత‌ను నన్ను మోసం చేశాడు. దేవుడుంటే వాడిని చూసుకుంటాడు. రాము, రాధాకృష్ణన్‌ నన్ను చాలా రెచ్చగొట్టారు. వారికి ఎంతో మేలు చేశాను. కానీ వారు నాకు వారు చేసింది చాలా దారణం. నాకు ఒక‌డు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు. నా రెక్కల క‌ష్టం తిన‌ని వాడు లేడు బాబు త‌ప్ప. ఇది రాయ‌డానికి నేను ఎంత న‌ర‌కం అనుభ‌వించానో మాట‌ల్లో చెప్పలేను’ అని వైసీపీ వైరల్ చేస్తు్న్న లేఖలో ఉంది. ఇదంతా అవాస్తవమని తెలిసి కూడా ఎందుకిలా చేస్తున్నారో వైసీపీ బ్యాచ్‌కే తెలియాలి మరి.

చెప్పుతో కొట్టినట్లుగా..!
వాస్తవానికి ఇందులో ఎక్కడా రజనీకాంత్ పేరు లేకపోయినప్పటికీ.. వైసీపీ మాత్రం నానా రచ్చ చేస్తోంది. అంతేకాదు.. ఆఖరికి సిల్క్‌స్మిత చనిపోయినప్పుడు కడసారి చూసేందుకు ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా వెళ్లలేదని.. ఇందుకు సూపర్ స్టారే కారణమని కూడా జనాలను నమ్మించడానికి నానా యాగీ చేస్తోంది. అయితే.. ఈ లేఖను చూసిన రజనీ అభిమానులు, నెటిజన్లు.. దిమ్మదిరిగే కౌంటర్లు ఇస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ బ్యాచ్‌కు తగిన బుద్ధి చెబుతున్నారు. అంతేకాదు.. 32 సీబీఐ కేసులు ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి .. 32 దేశాల్లో అభిమానులను ఉన్న రజనీకాంత్‌కు పోలికేంటి అని చెప్పుతో కొట్టినట్లుగా మాట్లాడుతున్నారు. మరోవైపు.. ‘వైఎస్‌ జగన్ రజనీకి క్షమాపణలు చెప్పాలి’, ‘వైసీపీ రజనీకి క్షమాపణలు చెప్పాలి’, ‘తెలుగు పీపుల్‌ స్టాండ్‌ విత్ రజనీ’ అనే హ్యాష్‌ట్యాగ్స్ ట్విట్టర్‌లో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

చంద్రబాబుకు ఫోన్..
ఏపీలో ఇంత రచ్చ జరుగుతున్నా ఒక్కసారంటే ఒక్కసారి కూడా రజనీకాంత్ అయితే స్పందించనే లేదు. అయితే.. చంద్రబాబు మాత్రం ట్విట్టర్‌లో చేసిన ఒక ట్వీట్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మంగళవారం నాడు రజనీకాంత్-చంద్రబాబు ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. సుమారు అరగంటపాటు జరిగిన ఈ సంభాషణలో వైసీపీ నేతల విమర్శల గురించే చర్చ నడిచింది. ‘ఎవరెన్ని విమర్శలు చేసినా నా అభిప్రాయం మారబోదు. ఉన్న విషయాలే నేను చెప్పాను అని అందరికీ తెలిసిందే. విమర్శలపై అభిమాన సంఘాలు విరుచుకుపడుతున్నా సంయమనం పాటించాలని ఇప్పటికే నేను చెప్పాను. ఎవరెన్ని విమర్శలు చేసినా నేను స్పందించే పరిస్థితే లేదు. ఎన్టీఆర్‌ లాంటి గొప్ప నటుడు, నేత శతజయంతి ఉత్సవాల సందర్బంగా పుస్తకావిష్కరణలో పాల్గొనడం నా అదృష్టం’ అని చంద్రబాబుతో రజనీకాంత్ అన్నారు. అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నారు. మొత్తానికి చూస్తే.. ఈ ఎపిసోడ్‌ కంటిన్యూ అయ్యేలానే కనిపిస్తోందే తప్ప.. ఫుల్‌స్టాప్ పడే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. మరి ఇటు జగన్ కానీ.. అటు రజనీకాంత్ కానీ రియాక్ట్ అయితే తప్ప ఫుల్‌స్టాప్ పడదేమో.. ఏం జరుగుతుందో చూద్దాం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago