Bullet bandi song fame Ashok : “నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త బా”అంటూ టాలీవుడ్ టాప్ సింగర్ మోహన భోగరాజు తన యూట్యూబ్ ఛానెల్ కోసం ఆడి, పాడిన పాట. దాదాపు 20 మిలియన్ వ్యూస్ తో హిట్ అయింది. కానీ సాయి శ్రీయ అనే నవ వధువు ఎప్పుడైతే ఈ పాటకు తన పెళ్లిలో పెళ్లి కొడుకు వచ్చేటపుడు డాన్స్ చేసిందో ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. అప్పటి వరకు 20 మిలియన్ వ్యూస్ ఉన్న వీడియో 200 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక ఆ తరువాత ఏ పెళ్లి చూసినా ఆ పాటకు డాన్స్ వేయడం ఒక స్టైల్ గా మారిపోయింది, అంతలా ఆ డాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఇక సాయిశ్రీయ కు నెక్స్ట్ వాళ్ళ ప్రాజెక్ట్ లో బుల్లెట్ బండి సాంగ్ వాళ్ళు ఆఫర్ కూడా ఇచ్చారు.
ఏసీబీ చేతిలో అశోక్…
ఆ పాటతో ఫేమస్ అయిన నవవధువు సాయిశ్రీయ భర్త అశోక్ ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. సాయి శ్రీయ భర్త అశోక్ ఒక ప్రభుత్వ ఉద్యోగి, టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ గా హైదరాబాద్ శివారు ప్రాంతంలో పని చేస్తున్నారు. ఇంటి ప్లాన్ అప్రూవల్ కి లంచం డిమాండ్ చేసాడన్న ఆరోపణలతో రంగలోకి దిగిన ఏసీబీ లంచం తీసుకుంటుండగా అశోక్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
హైదరాబాద్ శివారులోని శాటిలైట్ టౌన్షిప్ బదంగ్ పేట్ మున్సిపల్ కార్యాలయం లో టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. బదంగ్ పేట్ కి చెందిన దేవేందర్ రెడ్డి అనే వ్యక్తిని ఇంటి అప్రూవల్ కోసం లంచం డిమాండ్ చేసాడట. లంచం ఇవ్వకపోతే పని జరగదని హుకుం జారిచేశాడట. ఏసీబీ ని ఆశ్రయించిన దేవేందర్ రెడ్డి అశోక్ మీద ఫిర్యాదు చేసారు. నిఘా పెట్టిన ఏసీబీ 30 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అశోక్ ను పట్టుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…