Featured

Imandhi Ramarao : విజయశాంతి భర్త బాలకృష్ణ బంధువు… పిల్లలు కనకపోడానికి కారణం అదే : ఇమంది రామారావు

Imandhi Ramarao : 14 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి నేటి భారతం, ప్రతిఘటన వంటి సినిమాలతో నటనతో మెప్పించిన విజయశాంతి ఆ తరువాత గ్లామర్ హీరోయిన్ గా కూడా సక్సెస్ అయింది. సౌత్ అన్ని భాషలలో నటించిన విజయశాంతి అటు హిందీలో కూడా నటించింది. ‘కర్తవ్యం’ వంటి సినిమాలతో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ గా మారిపోయింది. తొంభై లలో అగ్ర హీరోయిన్ గా వెలిగిన విజయశాంతి ఏకంగా అప్పటి అగ్ర హీరోలైన చిరంజీవి, రజనీకాంత్ వంటి హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంది. ఇక రాజకీయాల్లోనూ చెరగని ముద్ర వేసుకున్న విజయ శాంతి అప్పట్లో చిరు, బాలయ్యలకు హిట్ కాంబినేషన్. ఏకంగా ఇద్దరితో పదుల సంఖ్యలో సినిమాల్లో నటించింది. అందులోనూ చాలా వరకు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.

విజయశాంతి భర్త ఎవరంటే… పిల్లల్ని ఎందుకు కనలేదు…

ఇక రాజకీయాంగాను తల్లి తెలంగాణ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విజయశాంతి ఆ తరువాత తెరాస, కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ లో క్రియాశీలకంగా ఉన్నారు. అయితే వ్యక్తిగత జీవితం గురించి చాలా గోప్యంగా ఉండే విజయశాంతి తన భర్త పేరును కూడా ఎపుడూ బయటకు చెప్పలేదు. ఈ మధ్య కాలంలోనే ఆయన గురించిన వివరాలు తెలిసాయి జనాలకు. విజయశాంతి భర్త పేరు శ్రీనివాసరావు ప్రసాద్ గారు. విజయశాంతి తండ్రి పేరు కూడా అదే కావడం విశేషం. అందుకే ఆమె తన భర్తను నాన్న అని అంటే శ్రీనివాసరావు ప్రసాద్ గారు చిన్ని అని పిలుస్తారు. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే శ్రీనివాస్ ప్రసాద్ గారు బాలకృష్ణ గారికి బంధువు.

బాలకృష్ణ గారి వద్ద ఉండేవారు చాలంకాలం అయన సినిమాలకు సంబంధిచిన వ్యవహారాలు చూసుకున్నారు. ఇక విజయశాంతి గారు మొదటి నుండి సమాజ సేవ గురించి ఆలోచించడం వల్ల సొంత పిల్లలు వద్దని భావించారట. సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని భావించి తాను ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయాల్ని ఇటీవల యూట్యూబ్ లో ఒక ఇంటర్వ్యూలో సీనియరర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు పంచుకున్నారు. ఆయన ఆంధ్ర ప్రభ పత్రికలో విజయశాంతి జీవిత కథను ‘నా కథ’ అనే టైటిల్ తో వారం వారం వచ్చేలా రాసేవారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago