Isha Koppikar : క్యాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ పేరు ఏదైనా ఒక సినిమాలో అవకాశం కోసం ఒక లేడీ ఆర్టిస్ట్ లైంగిక వేధింపులకు గురవ్వుతూనే ఉంది. ఇది ఒక్క సినిమా రంగంలోనే కాదు మిగిలిన రంగాల్లో కూడా ఉన్నా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ లో బయటకు వచ్చింది. చాలా కాలంగా క్యాస్టింగ్ కౌచ్ ఉన్నా ఈ మధ్య కాలంలో హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళు ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బహిరంగంగా చెప్పడం వల్ల కొన్ని సంఘటనలు బయటికి వస్తున్నాయి.
ఆ బాలీవుడ్ హీరో, నిర్మాత వేదించాడు…
చంద్రలేఖ, కేశవ, ప్రేమతో రా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్నా ఇషా కొప్పీకర్ ఆ సినిమాల తరువాత టాలీవుడ్ లో కనిపించలేదు. బాలీవుడ్ ని నమ్ముకున్న ఇషా తాజాగా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను పంచుకుని అందరికీ షాకిచ్చింది. ఒక బాలీవుడ్ బడా హీరో మరియు నిర్మాత తనను లైంజిక వేధింపులకు గురిచేసాడని చెప్పింది.
ఒక సినిమాలో అవకాశం ఇచ్చిన ఆ బాలీవుడ్ హీరో తనను వ్యక్తిగతంగా కలవమని చెప్పగా తన సిబ్బందితో పాటు వెళ్లి ఆ హీరోను కలిసే ప్రయత్నం చేసిందట ఇషా. దీంతో ఆ హీరో ఆమెతో మీటింగ్ క్యాన్సిల్ చేసి మరుసటి రోజున ఆమెను సినిమా నుండి తొలగించచారట. ఒక హీరోయిన్ అందంగా ఉండటమే కాదు హీరోల లిస్టులో చేరడం కూడా ముఖ్యమే అంటూ, కమిట్మెంట్ కి తలవంచక పోవడం వల్ల పెద్ద సినిమాల్లో అవకాశాలు కోల్పోయానని ఇషా చెప్పింది. సినిమా ఇండస్ట్రీలో గొప్ప కెరీర్ లేకపోయినా నిజాయితీగా బతకడమే నాకు ముఖ్యం అంటూ ఇషా కోప్పీకర్ అభిప్రాయపడింది.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…