Categories: FeaturedMovie News

Senior journalist Bhardwaja : శోభన్ బాబు హీరోగా చేయాల్సిన యమగోల, అడవిరాముడు చివరికి ఎన్టీఆర్ దగ్గరికి ఎలా వెళ్ళింది… తెర వెనుక జరిగింది ఇదే : సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Senior journalist Bhardwaja : ఎన్టీఆర్ హీరోగా 1977 సంవత్సరం లో వచ్చిన మూడు చిత్రాలు సిల్వర్ జూబ్లీ చేసుకున్నాయి. ఈ అరుదైన ఘనత మరే హీరోకి ఇంతవరకూ లేదు. ఎన్టీఆర్ కూడా తిరిగి అలాంటి రికార్డును అందుకోలేదు. 1977 లో జనవరి సంక్రాంతికి విడుదల అయిన ‘దాన వీర శూర కర్ణ’ సినిమా మంచి విజయం పొందిది. ఇక ఆ సినిమా తరువాత విడుదల అయిన ‘అడవిరాముడు, యమగోల’ కూడా అదే సంవత్సరం విడుదల అయి హ్యాట్రిక్ విజయన్ని నమోదు చేసాయి. ఇంత ఘన విజయాన్ని ఎన్టీఆర్ కెరీర్ లోనే అందించిన అడవిరాముడు, యమగోల సినిమాలు మొదట శోభన్ బాబు దగ్గరికి వెళ్లాయి కానీ ఆయన చేయకపోవడం తో ఎన్టీఆర్ దగ్గరికి వచ్చాయి.

తెర వెనుక జరిగింది ఇదే…

శోభన్ బాబు గారితో రెండు సినిమాలు చేసి ప్లాపులు మూటగట్టుకున్న సత్యచిత్ర బ్యానర్ వాళ్ళు సూర్య నారాయణ, సత్య నారాయణలు ‘అడవిరాముడు’ సినిమాను ఎన్టీఆర్ తో తీశారు. కానీ అంతకు ముందు జరిగిన విషయాలే ఆసక్తికరం. శోభన్ బాబు గారితో ‘ప్రేమ బంధం’ అనే సినిమాను తీసిన సత్యచిత్ర బ్యానర్ వాళ్ళు ఎన్టీఆర్ ‘ఆరాధన’ సినిమా దెబ్బకి నష్టాలు చూసారు. ఒకసారి వాళ్ళు ఎన్టీఆర్ కు కనబడితే ఆయన మీ సినిమా ఏమైంది విడుదల అయ్యిందా అని అడుగగా మీ ఆరాధన సినిమా దెబ్బకి పోయింది అని చెబితే అయితే ఒక కథ సిద్ధం చేసుకొండి సినిమా చేస్తాను మీకు అని హామీ ఇచ్చారట. ఇక సూర్య నారాయణ, సత్య నారాయణ లు కన్నడ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేసి రాఘవేంద్ర రావు ను డైరెక్టర్ గా పరిచయం చేయాలని అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ రీమేక్ అంటున్నారు కాబట్టి దర్శకుడు లాల్ అయితే బాగుంటారు అని చెప్పారట, అదీకాక అవుట్ డోర్ రానని చెప్పారట. ఇక కథ శోభన్ బాబు దగ్గరికి వెళ్ళింది. అయితే అయన నాకు ఇలాంటి కథలు నప్పవు అని చెప్పారట అప్పటికే రెండు ప్లాపులు వచ్చినందున వారికి మరింత నష్టం చేయకూడదని భావించారు. ఇక సినిమాను అవుట్ డోర్ ఫారెస్ట్ లో తీయాలనీ ఫిక్స్ అయిన నిర్మాతలు మళ్ళీ ఎన్టీఆర్ ను అడిగితే ఆయన ఇక్కడైతే నేను రెండు సినిమాలు చేస్తాను అడవికి వచ్చి నేనేం చేయాలి అని అడిగితే రెండు సినిమాల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి సినిమా తీశారు. ఇక సినిమా హిట్ అయ్యాక ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ డబల్ అయిపోయింది.

ఇక ‘యమగోల’ సినిమా కథ కూడా ముందు శోభన్ బాబు వద్దకు వెళితే ఇలాంటి పాత్రలు నాకంటే ఎన్టీఆర్ గారికి అయితే బాగుంటాయి ఆయనను కలవమని నిర్మాత వెంకటరత్నం గారికి చెప్పారట. అయితే అప్పటి వరకూ వెంకటరత్నం గారు శోభన్ బాబు గారితో మాత్రమే సినిమాలు చేసారు. ఎన్టీఆర్ వద్దకు వెళ్లాలంటే ఇబ్బంది పడ్డారు. ఇక నరసరాజు గారి ప్రోత్సాహం తో వెళ్లగా ఆయన కథకు వెంటనే కనెస్ట్ అయ్యారు. అయితే సినిమాలో యముడి పాత్ర మీరు, సత్యం పాత్ర బాలకృష్ణ తో వేయిద్దామని నరసరాజు గారు అభిప్రాయపడ్డారు. కానీ ఎన్టీఆర్ గారు బాలకృష్ణ కు అంత వయసు కానీ, అనుభవం కానీ సత్యం పాత్ర చేయడానికి లేవు. నేను సత్యం పాత్ర చేస్తాను యముడి పాత్రకు కైకాల సత్యనారాయణ ను తీసుకుందాం అని చెప్పారట. ఇక సత్యనారాయణ ను కూడా ఎన్టీఆర్ ఒప్పించారట. అలా యమగోల కూడా షూటింగ్ జరుగుతుండగా రైటర్ నరసరాజు ఖచ్చితంగా సెట్స్ లో ఉండాలిసిందే అని ఎన్టీఆర్ గారు షరతు పెట్టడం వల్ల రోజూ సెట్స్ లో డైలాగులలో మార్పులు జరిగేవట. ఇక అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ను విమర్శిస్తూ కొన్ని డైలాగులు ఉండటం వల్ల వెంకట రత్నం గారు భయపడ్డారు. సినిమా విడుదల అయి హిట్ అయ్యాక కానీ ఆయనకు టెన్షన్ తగ్గలేదట.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago