నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రూపొందిన మూడో చిత్రం ‘అఖండ’. డిసెంబరు 2న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో చిత్రబృందం నిర్వహించింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, దర్శకుడు రాజమౌళి హాజరయ్యారు.
వారి ఆధ్వర్యంలోనే ఈ ఈవెంట్ ఘనంగా జరిగింది. తర్వాత ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. సినిమాపై బాలయ్యకు ఉన్న ఆసక్తి ఆయన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయన్నారు. ఆయన చెప్పే డైలాగ్ డెలివరీని తాను ఎవరి దగ్గర చూడలేదన్నారు. ఆయనలా ఎవరూ చెప్పలేరని అన్నారు.
అతడు ఎప్పుడూ రియాల్టీగా ఉంటారని.. కల్మషం లేని వ్యక్తి అని.. ఆయనలో నాకు నచ్చే క్వాలిటీ అదే అంటూ పొగడ్తలతో ముంచెత్తెశాడు. ఇక దర్శకుడు బోయపాటి శ్రీను గరించి మాట్లాడుతూ.. రవితేజ హీరోగా నటించి మంచి విజయవంతం అందుకున్న సినిమా భద్ర. ఆయన భద్ర కథ చెప్పినప్పుడే ఎంతో పెద్ద గొప్ప డైరెక్టర్ అవుతానని తాను చెప్పినట్టు బన్నీ గుర్తు చేసుకున్నారు.
ఇక భద్ర కథ ముందుగా తనకే చెప్పారని.. అయితే తాను ‘ఆర్య’ సినిమాకు కమిట్ అవ్వడంతో భద్ర చేయలేకపోయానని బన్నీ చెప్పారు. ఆ లోటు సరైనోడుతో తీరిందని చెప్పాడు. నన్ను ఇష్టపడే వ్యక్తుల్లో బోయపాటి గారు ఒకరు అంటూ చెప్పారు. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో ఇది మూడో సినిమా అని.. ఇది హ్యాట్రిక్ కొడుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…