Featured

C. Narayana reddy : ఇండస్ట్రీకి రెండు కళ్ళైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మధ్య అభిప్రాయ బేధాలు… అప్పుడు పాటలు రాసిన సినారె…!

C. Narayana reddy : తెలుగు సినిమా అనగానే గుర్తొచ్చే నటులలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్విఆర్, సావిత్రి. ఇక మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లంటే తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్ళ వంటి వారు. ఒకరు జానపదం, పౌరాణికంకి రారాజు అయితే మరొకరు సాంఘిక, కుటుంబ కథా చిత్రాల రారాజు. పౌరాణికాల్లో తనకు పోటీ ఎవరూ లేరని ఎన్టీఆర్ ముద్ర వేసుకుంటే, ప్రేమికుడి పాత్రలో తనకు సాటి లేడని నాగేశ్వరావు నిరూపించుకున్నారు. ఇద్దరూ అప్పట్లో పోటీ పడి నటించేవారు. ఇద్దరి సినిమాలకు గట్టి పోటీ ఉండేది. కానీ అలా పోటీ ఉన్న నటులైనా సుమారు 15 సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు, ప్రేక్షకులను మెప్పించారు.

ఆ ఒక్క మాట, సంఘటనతో ఇద్దరి మధ్య మనస్పర్థలు…

ఇద్దరూ ఎంతో కలిసి మెలిసి ఉండే అగ్ర హీరోలీద్దరి మధ్య ఒకసారి మనస్పర్థలు వచ్చాయి. ఈ విషయాన్ని రచయిత సీ నారాయణ రెడ్డి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ఒక సినిమాలో కృష్ణుడు వేషం వయాలని ఎన్టీఆర్ గారు నాగేశ్వరావు గారిని అడిగాడట. అయితే ఆ వేషం వేయనని ఆ ఒక్కటి అడగవద్దు మహానుభావా అని సున్నితంగా తిరస్కరించారట నాగేశ్వరావు గారు. అయినా ఎన్టీఆర్ వదలకుండా అప్పటి సీఎం జలగం వెంకట్రావు గారి చేత అడిగించారట, అయినా ఫలితం లేకపోవడం వల్ల ఇక అప్పటి నుండి ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందట.

ఇక ఆ తరువాత ఇద్దరూ కలిసి నటించకూడదని నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయాలు సీ నారాయణ రెడ్డి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. గులేభకావళి సినిమాకోసం పాట రాయమని ఎన్టీఆర్ అడిగితే నారాయణరెడ్డి గారు సినిమాలో అన్ని పాటలు ఇస్తే రాస్తానని చెప్పారట. తనకు మొదటి సినిమా అవ్వడం వల్ల అలా కండిషన్ పెట్టారట సినారె. దీనికి ఎన్టీఆర్ ఒప్పుకుని మొత్తం పది పాటలు ఇచ్చారు. ఇక ఆ తరువాత కొద్ది రోజులకు నాగేశ్వరావు గారి సినిమా ఇద్దరు మిత్రులకు పాట రాయమని అవకాశం వస్తే వద్దని తిరస్కరించారట నారాయణ రెడ్డి గారు. ఒకవేళ నాగేశ్వరావు గారి సినిమా మొదట విడుదలయితే మొదటి సినిమా అనే క్రెడిట్ మీకు వస్తుంది, మొదట సినిమా మీకు అని ఎన్టీఆర్ కి మాటిచ్చాను అందుకోసం మొత్తం సినిమాలో పాటలు అయన నాకే ఇచ్చాడు, ఇపుడు మాట తప్పినట్లవుతుంది అని తిరస్కరించాను కానీ వారు మధ్య అభిప్రాయ బేధాలు ఉన్న సమయంలో కూడా వాళ్లిద్దరికీ పాటలు రాశానని చెప్పారు నారాయణ రెడ్డి గారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago