Featured

Actress Jayalalitha : నా జీవితాన్ని ముక్కలు చేసారు… మా మధ్య బంధం దేవుడికి తెలుసు…: నటి జయలలిత

Actress Jayalalitha : బోరింగు పాప అనగానే టక్కున గుర్తొచ్చే నాటి జయలలిత. తాజాగా జీ తెలుగులో ప్రసారమయ్యే సూపర్ హిట్ సీరియల్ ప్రేమ ఎంత మధురం లో హీరో ఆర్యవర్ధన్ తల్లిగా హుందగా కనిపించే పాత్రలో అదరగొడుతున్న జయలలిత గారు అటు సినిమాలు చేస్తూనే ఇటు సీరియల్స్ లో కనిపిస్తున్నారు. ఎక్కువగా వాంప్ తరహా పాత్రలను చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న జయలలిత ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం పెళ్లి తనకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది అంటూ చెప్పారు.

చచ్చిపోతా అని చివరికి చిత్ర వధ చేసాడు…

జయలలిత తెలుగు, కన్నడ తమిళంతో పాటు మలయాళంలోనూ ఎక్కువ సినిమాలను చేసారు. అందునా మలయాళంలో చాలా సినిమాలలో నటించిన ఆమె ఒక డైరెక్టర్ తో దాదాపు 25 సినిమాలను చేశారట. ఆ సమయంలోనే ఆ డైరెక్టర్ తో పరిచయం ప్రేమగా మారి ఇదేళ్లు ప్రేమించుకున్నారట. ఇంట్లో వాళ్ళు, తెలుగు ఇండస్ట్రీలో వాళ్లకు అతడిని పరిచయం చేస్తే వద్దు దొంగ కోళ్లు పట్టేవాడిలాగా ఉన్నాడు, ఆలోచించుకో అని చెప్పారట. అయితే ఆ డైరెక్టర్ మాత్రం పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అంటూ మాట్లాడటంతో అతడిది నిజమైన ప్రేమ అనుకుని కోచ్చిన్ లో పెళ్లి చేసుకున్నారట. అయితే పెళ్ళైన కొద్ది రోజులకే ఆస్తి కోసం డబ్బు కోసం చిత్రవధ చేసేవాడని, ఒక గదిలో ఉంచి హింసించిగా చలపతి రావు, పరుచూరు గోపాలకృష్ణ గారి వల్ల బయటికి రాగలిగానని, అక్కడే ఉంటే ఏమైపోయి ఉండేదాన్నో తెలియదు అంటూ చెప్పారు. అలా ఆ డైరెక్టర్ నా జీవితాన్ని నాశనం చేసాడు అంటూ చెప్పారు.

ఇక గుమ్మడి గారి గురించి మాట్లాడుతూ గుమ్మడి గారిని చివరి రోజుల్లో బాగా చూసుకున్నాను. ఆయన అడిగిన వంట చేసుకుని వెళ్లి ఆయనతో కాసేపు మాట్లాడి వచ్చేదాన్ని కానీ ఆయనకు నాకు మధ్య ఇంకేదో సంబంధం ఉంది అన్నట్లుగా చిత్రీకరించారు. ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి లాగా వీళ్ళు తయారయ్యారు అన్నట్లు మాట్లాడారు. ఆయన మరణించాక ఆయన పిల్లలు అలానే దూరం పెట్టారు. నిజానికి ఆయన వద్ద ఆస్థి లేదు నేను ఆయన చిన్న కూతరు కంటే మూడేళ్లు చిన్నదాన్ని అలాంటి నాకు సంబంధం పెట్టుకోవాలంటే వయసులో ఉండేవాళ్ళు దొరకరా, కానీ మా మధ్య ఎలాంటి సంబంధం ఉందో ఆ దేవుడికే తెలుసు. నేను తప్పు చేయలేదని నాకు తెలుసు అందుకే నిర్భయంగా ఉన్నాను అంటూ జయలలిత చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago