“ఇప్పటికీ నా వయసు నిండా పదహారే…” అంటూ “పోకిరి”లో కుర్రకారును ఊపేసిన ముమైత్ ఖాన్ గతంలో ఓసారి డ్రగ్స్ వ్యవహారంలో ఇరుక్కుని సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.! గతంలో బిగ్ బాస్ తొలి సీజన్‌తో తెలుగు ఆడియెన్స్‌ని పలకరించిన సినీ నటి, ముమైత్ ఖాన్ ఆ తర్వాత అంతగా మీడియా ముందుకు రాలేదు. సినిమా అవకాశాలు కూడా బాగా తగ్గిపోవడంతో ముమైత్ ఖాన్ పేరు ఏఁధ్య కాలంలో అంతగా వినిపించలేదు. అయితే ఈ టాలీవుడ్ ఐటం భామ మరోసారి లేటెస్ట్ గా వార్తల్లోకొచ్చింది. అయితే ఈసారి ముమైత్ ఖాన్ తనను మోసం చేసిందంటూ హైదరాబాద్ కి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ పోలీసులను ఆశ్రయించడం విశేషం. వివరాలోకి వెళ్తే..
హైదరాబాద్ కి చెందిన క్యాబ్ డ్రైవర్ రాఘవ రాజు అనే వ్యక్తి ముమైత్ ఖాన్ తనను మోసం చేసిందంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసాడు. ముమైత్ హైదరాబాద్ నుండి గోవా వెళ్ళడానికి 4 రోజులు కారు అద్దెకు మాట్లాడుకుందని, అయితే తీరా గోవా వెళ్లిన తర్వాత అక్కడే 7 రోజులు తన కారును తిప్పుతూ గడపడమే కాకుండా కనీసం తన ఫుడ్డు, బెడ్డు గురించి కూడా ముమైత్ పట్టించుకోలేదని, కార్లో డీజిల్ కూడా తన డబ్బులతోనే కొట్టించానని, ఖర్చు చేసిన డబ్బులన్నీ ముమైత్ చివరకు ఇస్తుందేమో అనుకున్నాకానీ ఇప్పుడు ముమైత్ డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిందని, ముమైత్ తనకు మొత్తం 15 వేల రూపాయలు ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశాడు రాఘవ. ఆర్ధికంగా చితికిపోయిన తనకు 15 వేల రూపాయలు ముమైత్ నుండి ఇప్పించాలని పోలీసులను కోరాడు. ఈ విషయమ సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో డ్రైవర్ పొట్ట గొట్టడం ఏమిటని నెటిజన్లు ముమైత్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…