“ఇప్పటికీ నా వయసు నిండా పదహారే…” అంటూ “పోకిరి”లో కుర్రకారును ఊపేసిన ముమైత్ ఖాన్ గతంలో ఓసారి డ్రగ్స్ వ్యవహారంలో ఇరుక్కుని సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.! గతంలో బిగ్ బాస్ తొలి సీజన్‌తో తెలుగు ఆడియెన్స్‌ని పలకరించిన సినీ నటి, ముమైత్ ఖాన్ ఆ తర్వాత అంతగా మీడియా ముందుకు రాలేదు. సినిమా అవకాశాలు కూడా బాగా తగ్గిపోవడంతో ముమైత్ ఖాన్ పేరు ఏఁధ్య కాలంలో అంతగా వినిపించలేదు. అయితే ఈ టాలీవుడ్ ఐటం భామ మరోసారి లేటెస్ట్ గా వార్తల్లోకొచ్చింది. అయితే ఈసారి ముమైత్ ఖాన్ తనను మోసం చేసిందంటూ హైదరాబాద్ కి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ పోలీసులను ఆశ్రయించడం విశేషం. వివరాలోకి వెళ్తే..

హైదరాబాద్ కి చెందిన క్యాబ్ డ్రైవర్ రాఘవ రాజు అనే వ్యక్తి ముమైత్ ఖాన్ తనను మోసం చేసిందంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసాడు. ముమైత్ హైదరాబాద్ నుండి గోవా వెళ్ళడానికి 4 రోజులు కారు అద్దెకు మాట్లాడుకుందని, అయితే తీరా గోవా వెళ్లిన తర్వాత అక్కడే 7 రోజులు తన కారును తిప్పుతూ గడపడమే కాకుండా కనీసం తన ఫుడ్డు, బెడ్డు గురించి కూడా ముమైత్ పట్టించుకోలేదని, కార్లో డీజిల్ కూడా తన డబ్బులతోనే కొట్టించానని, ఖర్చు చేసిన డబ్బులన్నీ ముమైత్ చివరకు ఇస్తుందేమో అనుకున్నాకానీ ఇప్పుడు ముమైత్ డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిందని, ముమైత్ తనకు మొత్తం 15 వేల రూపాయలు ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశాడు రాఘవ. ఆర్ధికంగా చితికిపోయిన తనకు 15 వేల రూపాయలు ముమైత్ నుండి ఇప్పించాలని పోలీసులను కోరాడు. ఈ విషయమ సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో డ్రైవర్ పొట్ట గొట్టడం ఏమిటని నెటిజన్లు ముమైత్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here