Cash : మనవాళ్ళు బాలీవుడ్ కి వెళ్లి అక్కడ ఒక సినిమాలో చిన్న పాత్ర చేసినా అది గొప్పగా చెప్పుకునే రోజులు పోయాయి. ఇప్పుడు బాలీవుడ్ జనాలు సౌత్ లో నటించాలని తహ తహ లాడుతున్నారు. మరీ ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్ లో ఒక్క సినిమా చేయాలని అనుకుంటారు. అంతలా మన సినిమా క్రేజ్ పెంచాయి మన సినిమాలు. దీనికి బీజం వేసింది మాత్రం మన దర్శక ధీరుడు రాజమౌళినే. ఇక ఇపుడు ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో రన్ బీర్ కపూర్, ఆలియా భట్ ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ షోలో సందడి చేసారు. ప్రోమో వదిలి అందరినీ ఆశ్చర్య పరిచారు మల్లె మాల వాళ్ళు.
సుమ తో క్యాష్ ఆడటానికి వచ్చిన బ్రహ్మాస్త్రా టీం…
క్యాష్ షో లో సెలబ్రిటీలు రావడం కామన్ కానీ ఈసారి ఏకంగా బాలీవుడ్ వాళ్ళు రావడంతో మరింత క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ హీరో రన్ బీర్, ఆలియా, అలాగే మన జక్కన షోకి వచ్చారు. బ్రహ్మాస్త్రా సినిమా సెప్టెంబర్ 7 న విడుదల సందర్బంగా ఈవెంట్ నిర్వహించాలని అనుకుంటే అది కాస్తా రధ్ధవడంతో ఇక టీవీ షోస్ లో సినిమాను ప్రమోట్ చేయడానికి ఫిక్స్ అయినట్టున్నారు. ఇక రాజమౌళి సౌత్ లో ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తుండడంతో సినిమా ప్రొమోషన్స్ బాధ్యత తన నెత్తిన వేసుకున్నట్లున్నాడు.
ఇక అందుకే సుమ క్యాష్ ప్రోగ్రామ్ లో కనిపించి సినిమాకు మంచి ప్రొమోషన్ ఇవ్వాలని ఫిక్స్ అయినట్లు ఉన్నాడు. ఇక షో ప్రోమోలో జస్ట్ వాళ్లను చూపించారు. ఇక జక్కన్న రాగానే సుమ ఒకసారి గిల్లమని అనడం చేతిని గిల్లించుకుని ఇది కల కాదు నిజమే అంటూ ఫన్ చేస్తుంది సుమ. ఇక రన్ బీర్, ఆలియా లను చూపించారు ప్రోమోలో. ఇక ప్రోమో విడుదలయిన కాసేపటికి నెటిజన్స్ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ కి క్రేజ్ ఉండేది, కానీ ఇపుడు బాలీవుడ్ వాళ్ళు టాలీవుడ్ డైరెక్టర్స్ తో చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. మనదగ్గరికి వచ్చి సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు ఇదంతా జక్కన్న వల్లే అంటూ ‘అట్లుంటది మనతోని’ అంటూ పంచులేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…