Charmi kour : లైగర్ సినిమా ఆగస్టు లో భారీ అంచనాలు నడుమ విడుదలయి డిజాస్టర్ గా మిగిలింది. డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చిన ఈ సినిమా ఫెయిల్యూర్ సినిమా టీం ను నిరుత్సాహ పరించింది. అయితే సినిమా పరాజయం గురించి నిర్మాత అయిన ఛార్మి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను మాట్లాడారు. లైగర్ సినిమా కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ, ఛార్మి ల పీసీ కనెక్ట్స్ సంస్థ రెండు సయుక్తంగా నిర్మించాయి. సినిమా బాలీవుడ్ లోనూ అలాగే సౌత్ లోనూ భారీ అంచనాల నడుమ విడుదలయింది, అయితే సినిమా ఫెయిల్ అవడానికి కారణాలను ఛార్మి వివరించే ప్రయత్నం చేసింది.
వరుస తెలుగు సినిమాలు బాలీవుడ్ లో మంచి కలెక్షన్స్ వచ్చాయి… కానీ లైగర్…
లైగర్ సినిమాను 2020 లో మొదలు పెడితే 2022 కి థియేటర కి వచ్చింది. పెద్ద సినిమాలైన ఆర్ఆర్ఆర్, పుష్ప రెండింటినీ ముందుగా విడుదల చేస్తే మూత పడిన థియేటర్స్ కి కొత్తకళ వస్తుందనే ఉద్దేశంతో ఆ సినిమాలకు అడ్డురాలేదు. ఇక చివరికి ఆగష్టు న మా సినిమా కు డేట్స్ దొరికాయి. లైగర్ సినిమాకు తొలి నుండి అడ్డంకులు వస్తూనే ఉన్నా మేము ఎక్కడా ఆగలేదు అంటూ ఛార్మి మీడియాలో మీటింగులో చెప్పింది. ఇక జనాలు థియేటర్ వచ్చి ఒక సినిమా చూడాలంటే అందులో వాళ్ళను ఆశ్చర్య పరిచే ఏదో ఒక విషయం ఉండాలి.
ఓటీటీ వచ్చాక సినిమాలను ఇంటిల్లిపాది కూర్చొని ఇంట్లో చూడటం ఇష్టపడుతున్నారు అలాంటి వాళ్ళను థియేటర్ కి రప్పించాలంటే సినిమాలో కంటెంట్ చాలా అవసరం. సినిమాలను థియేటర్ కి వచ్చి చూసే పరిస్థితి లేదా అంటే బింబిసార, సీతా రామం, కార్తికేయ వంటి సినిమాలు 150 కోట్ల వరకు వసూళ్లను రాబట్టాయి. చిన్న సినిమాలుగా వచ్చి బాలీవుడ్ లోనూ 100 కోట్ల వరకు వసూళ్లను రాబడుతున్నాయి. ఇక సౌత్ లో సినిమా పిచ్చి లేదని అనడం లేదు కానీ ఎలా జనాలు ఆలోచిస్తున్నారో తెలియడం లేదు కానీ సౌత్ లో పరిస్థితి కొంత డిప్రెస్సింగ్ గానే ఉంది అంటూ కార్తికేయ వంటి సినిమాల మీద ఒకింత ఈర్ష్య వ్యక్తం చేసినట్లుగా ఛార్మి మాట్లాడింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…