Cash Program: బుల్లితెర పై ప్రతి ఒక్క చానల్లోనూ ఎన్నో కార్యక్రమాలు ప్రచారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారమవుతున్నటువంటి క్యాష్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షోలో సుమ పెద్ద ఎత్తున గెస్ట్ లను ఆహ్వానించి సందడి చేస్తుంటారు. అదేవిధంగా ఈ షోలో గెలిచిన వారికి భారీగా ప్రైజ్ మనీ ఉంటుందనే విషయాన్ని కూడా సుమా చెబుతూ ఉంటారు.
ఇలా ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరూ నిజంగానే గెలుచుకున్న డబ్బును వారికి ఇస్తారా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. ఇకపోతే సుమ క్యాష్ కార్యక్రమంలో భాగంగా ఒక రౌండ్ కాలేజ్ స్టూడెంట్స్ తో కలిసి నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఈ స్టూడెంట్స్ అంతా నిజంగానే కాలేజీ విద్యార్థులేనా, ప్రతివారం ఇలా ఒక్కొక్క కాలేజ్ నుంచి వారిని అక్కడికి తీసుకు వస్తారా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది.
ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.సుమ క్యాష్ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లు గెలుచుకునే డబ్బును వారికి తిరిగి ఇవ్వరట. కేవలం షో కోసం వచ్చినందుకు మాత్రమే వారికి పేమెంట్ చెల్లిస్తారని తెలుస్తోంది. ఇక సినిమా ప్రమోషన్ల కోసం వచ్చేవారు వాళ్లే డబ్బు ఇచ్చి ఈ కార్యక్రమంలో సందడి చేస్తారు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో కాలేజ్ స్టూడెంట్లుగా సందడి చేసే వాళ్ళు నిజమైన స్టూడెంట్స్ కాదని.. వాళ్లందరూ కూడా జూనియర్ ఆర్టిస్టులు అంటూ తాజాగా ఓ వార్త వైరల్ అయింది. ఇలా స్టూడెంట్స్ వచ్చిన తర్వాత సుమ కొందరిని మాత్రమే కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది అయితే ఈ షో స్టార్ట్ కాకముందే జూనియర్ ఆర్టిస్టులందరికీ ముందుగానే స్క్రిప్ట్ ఇచ్చి సిద్ధం చేసి ఉంటారని తాజాగా క్యాష్ కార్యక్రమం గురించి ఈ వార్త చెక్కరలు కొడుతుంది.అయితే ఈ విషయం తెలిసిన ఎంతోమంది అభిమానులు ఇలా జూనియర్ ఆర్టిస్టులను పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ మల్లెమాలవారు ప్రేక్షకులను ఇంత మోసం చేస్తున్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…