Categories: FeaturedMovie News

Sandhya Janak : లక్నో తీసుకెళ్లి మరీ మహేష్ బాబుతో షూటింగ్ చేయించారు… సినిమా చూస్తే షాక్ : సంధ్య జనక్

Sandhya Janak : ‘హ్యాపీడేస్’ సినిమాలో తమన్నా తల్లి పాత్రలో మెరిసిన సంధ్య జనక్ పుట్టింది పిఠాపురం. తెలుగు వారే అయినా తండ్రి రైల్వే ఉద్యోగి అవ్వడం వల్ల నార్త్ లో చదువు కొనసాగించారు సంధ్య జనక్. కలకత్తా లో చదివిన సంధ్య జనక్ చిన్న వయసులోనే స్టేజి నాటకాలు రాస్తూ నటిస్తూ ఉండేవారట. ఆ ఆసక్తి సినిమాల్లోకి వచ్చేలా చేసిందంటూ చెప్తారు. ఇక అనసూయ, మర్యాదరామన్న, వేదం, శ్రీరామరాజ్యం, గుండెజారి గల్లంతయ్యిందే, కొత్తజంట, అనామిక… ఇలా విజయవంతమైన సినిమాలన్నింట్లో ఆమె కనిపించారు. అందంగా, హుందాగా హీరో, హీరోయిన్లకు తల్లిగా అనేక పాత్రల్ని పోషించిన సంధ్యా జనక్‌ ఏడేళ్ల సినిమా కెరీర్ లో యాభై కి పైగా సినిమాల్లో నటించారు.

మహేష్ సినిమాలో నటించిన సినిమా చూస్తే షాక్ అయ్యాను…

సినిమాల్లో కొన్ని సార్లు చేసిన ఎడిటింగ్ లో ఆ సీన్ లు పోతుంటాయి, సహాయక పాత్రలు చేసే వాళ్లకు స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉంటుంది. మంచి పాత్రలు వచ్చినపుడు చేస్తే గుర్తింపు రావడానికి కూడా అదృష్టం కలిసిరవాలి అంటూ చెప్పారు. ఇక కొన్ని సినిమాల్లో నటించినా, డబ్బింగ్ కూడా చెప్పి వచ్చిన సినిమా విడుదల అయ్యాక అసలు పాత్ర లేని సందర్భాలు చాలానే ఉంటాయంటూ చెప్పారు. మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలో ప్రకాష్ రాజ్ భార్య పాత్రలో నటించానని సంధ్య జనక్ చెప్పారు.

సినిమా షూటింగ్ కోసం లక్నో లో షూటింగ్ మహేష్ బాబు తో సీన్ రెండు మూడు సార్లు రీ టేక్ కూడా చేయించారట. డబ్బింగ్ పనులు కూడా పూర్తయి తీరా సినిమా చూసాక అసలు ఆ పాత్ర కనిపించక పోయే సరికి షాక్ అయిపోయాను అంటూ చెప్పారు. ఇక ‘రాధే శ్యామ్’ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాల్లో నటించినా ఆ సీన్స్ కూడా డిలీట్ అయ్యాయి. ఇక మహేష్ బాబు అంటే చాలా ఇష్టమంటూ చెప్పిన సంధ్య ప్రభాస్ చాలా డౌన్ టూ ఎర్త్ అంటూ చెప్పింది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago