వివాహేతర సంబంధాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. శారీరక సుఖం కోసం ఆశపడి తమపై ఆధారపడిన కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు.. తమ కుటుంబసభ్యుల కన్నీటికి కారణమవుతున్నారు. ఇంతకు ఇక్కడ జరిగిందేంటంటే.. ఇంట్లో భర్త లేనిది చూసి కట్టుకున్న భార్య పక్కింటి కుర్రాడిని ఇంటికి పిలిచింది. ఇంట్లో అత్తమామలు ఉన్నారనీ కూడా లేకుండా ధైర్యంగా ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు.
అటుగా వెళ్తున్న అత్త విషయాన్ని గ్రహించి వారు ఉన్న రూంకి గొళ్లెం వేసి తాళం వేసింది. అప్రమత్తమైన ఆ జంట ఎంత బతిమిలాడినా గొళ్లెం తీయలేదు. చివరకు ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. సిద్దిపేట జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన 27 సంవత్సరాల శివ, 25 సంవత్సరాల శీరిషలకు గత కొద్ది సంవత్సరాల క్రితమే వివాహం అయింది. మొదట్లో ఇద్దరు బాగానే ఉన్నా.. తర్వాత భార్య మోజు పక్కింటి కుర్రాడిపై పడింది. అల్లుడు వరుస అయ్యే శ్రీకాంత్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది.
కొంత కాలం తర్వాత వీరి విషయం కుటుంబసభ్యులకు తెలియడంతో పిలిచి మందలించి పంపించారు. తర్వాత ఓ రోజు శివ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఈ అవకాశం కోసం ఎదురు చూసిన తన భార్య శ్రీకాంత్ ను ఇంటికి రప్పించింది. ఇంట్లో అందరూ ఉన్నా తన రూంకి రప్పించుకొంది. రూంలోకి వెళ్లిన తర్వాత వాళ్లు లోపల గడియ పెట్టుకున్నారు.
వాళ్ల అత్తయ్య విషయాన్ని గ్రహించి వెంటనే బయట నుంచి గొళ్లెం పెట్టింది. శివ వచ్చే వరకు వాళ్లను అందులోనే ఉంచుదాం అనుకుంది. పరువు పోయిందనే ఉద్దేశ్యంతో లోపల ఉన్న వాళ్లు ఫ్యాన్ కు ఉరేసుకొని ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం వెళ్లి గ్రామస్తులు చూసేసరికి విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…