ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్లలో ఒకరైన శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన యాంకరింగ్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ క్రేజి బ్యూటీ.
బుల్లితెరపై కూడా వరుస షోలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది. ఇటీవల విడుదలైన ‘క్రేజీ అంకుల్స్’ సినిమాలో ఆమె ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాపై వివాదాలు మూటకట్టుకున్నాయి. మహిళా సంఘాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వలేదనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. శ్రీముఖి తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో శ్రీముఖి వంటలక్కగా.. ముక్కు అవినాష్ డాక్టర్ బాబుగా కనిపించారు. వీరిద్దరు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు ఎక్కడ ఉంటే అక్కడ సందడి సందడిగా గడిపేస్తుంటారు. వీటిలో భాగంగానే ఇద్దరు కలిసి కార్తీకదీపం సీరియల్ కు సంబంధించి రీల్ చేసి వీడియోను పోస్టు చేశారు. దీనిలో అవినాష్.. శ్రీముఖి చెంప చెల్లుమనిపిస్తాడు.
ఈ సీన్ లో పక్కనే శ్రీముఖి తమ్ముడు, అమ్మ కూడా ఉన్నారు. ‘అయితే ట్రీట్ మెంట్ తీసుకోను అంటావా’.. అంటూ అవినాష్ ..శ్రీముఖిని అడగ్గా ఆమె ‘తీసుకోను’ అని సమాధానం చెబుతుంది.. ఈ సీన్ చివరకు.. శ్రీముఖి అదేవిధంగా ప్రవర్తించడంతో అవినాష్ శ్రీముఖి చెంప చెల్లుమనిపించి.. ‘నిన్ను కొట్టే హక్కు మొగుడికే ఉంటుంది’ అంటూ చెబుతాడు అవినాష్. అయితే ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వీరి పర్ఫామెన్స్ కు తప్పకుండా అవార్డు ఇవ్వాల్సిందే అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…