Categories: FeaturedGeneral News

పిల్లి ఎదురొస్తే శుభం.. పిట్ట రెట్ట మంచిదే.. ఇలాంటివి ఆ దేశాల్లో శుభసూచికాలే.. ఎందుకంటే..!

మూఢనమ్మకాలను నమ్మోద్దని ఎంత మొత్తుకున్నా వినే వాళ్లు వింటున్నారు.. వినని వాళ్లు పట్టించుకోవడం లేదు. అయితే ఈ మూఢాచారాలు, నమ్మకాలు అనేవి మనదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా.. పిల్లి ఎదురొస్తే మనకు అశుభంగా పరిగణిస్తాం. కానీ జర్మనీలోని ప్రజలు దాన్ని శుభ సూచికంగా భావిస్తారట. ఇలా వివిధ దేశాల్లో ఉండే మూఢ నమ్మకాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. ఆకాశంలో ఏ పిట్ట అయినా మన దేశంలో రెట్ట వేసిందంటే.. మనం దానిని అసభ్యంగా భావించి వెళ్లి వెంటనే నీటితో శుభ్ర పరచుకుంటారు.

కానీ రష్యాలో అలా కాదు. పిట్ట రెట్ట వేసిందంటే చాలు.. ఇక వాళ్ల ఆనందానికి హద్దులే ఉండవు. అలా వారు పిట్ట రెట్ట కోసం ఎదురు చూస్తారట. దాని వల్ల వాళ్లకు కష్టాలు తొలగిపోతాయనే నమ్మకం. అంతేకాకుండా ధనప్రాప్తి కూడా కలుగుతుందనే విశ్వాసం ఉంటుంది. మన దగ్గర వీధి కుక్కలు దగ్గరకు వస్తేనే ఆమడ దూరం పోతాం.. లేదా ఏ రాయో తీసుకొని వాటిని దూరంగా తరిమేస్తాం.

అలా శనకాలకు సంబంధించి మలం గనుక మనం తొక్కామంటే.. ఆ రోజంతా విసుక్కుంటూ ఉంటాం. కానీ ఫ్రాన్స్ లో అలా ఉండదు. వాళ్ల నమ్మకం ఏంటంటే.. ధనం, ఐశ్వర్యం నిత్య కళ్యాణం.. పచ్చతోరణంగా ఉండాలన్నా.. ఇంకా ఎక్కవగా సంపాదించాలన్నా వాళ్లు మలాన్ని తొక్కితే ఇవన్నీ దరి చేరుతాయనే నమ్మకం ఉంటుందట. ఏ కార్యం అయినా చేయాలన్నా.. ఎక్కడికైనా వెళ్లాలన్నా.. మన దగ్గర తుమ్మితే కొంత సమయం ఆగి పనులను చేసుకుంటాం.

అయితే గ్రీస్ దేశంలో తుమ్మితే అక్కడి వారికి శుభ సూచికమంట. తమ బంధువులు, స్నేహితులు తమ గురించే తలచుకుంటున్నారనే విశ్వాసం అంట. రాత్రుల్లో అద్దం చూసుకోకూడదని జపాన్ వాసలు నమ్మకం. ఎందుకంటే ఆ సమయంలో అద్దంలో ఆత్మలు ఉంటాయట. అవి మనిషిలో ప్రవేశించి నష్టం కలిగిస్తాయని చెబుతారు. ఇలా టెక్నాలజీ ఎంతో అభివృద్ధి సాధించిన జపాన్ లోనే కాదు.. డెన్మార్క్, గ్రీస్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో కూడా కొన్ని వింత ఆచారాలను, మూఢనమ్మకాలను పాటిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాజకీయాలకు ఆధ్యాత్మిక టచ్.. విజయ్ వినూత్న ప్రచారం అందరి దృష్టిని ఆకర్షించింది!

తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…

12 minutes ago

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం.. యమునోత్రి, గంగోత్రి దర్శనాలకు భారీగా తరలివచ్చిన భక్తులు!

ఉత్తరాఖండ్‌లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్‌ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…

42 minutes ago

నా మాటలను వక్రీకరించారు.. ప్రకాశ్ రాజ్ క్లారిటీ

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…

21 hours ago

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

1 day ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

1 day ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

1 day ago