ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన క్రేజీ మూవీ పుష్ప. ఈ మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయనుంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచానాలు ఉన్నాయి. ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో పుష్ప సినిమా విడుదల కాబోతోంది.
అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ గా ఊర మాస్ లుక్కులో కనిపిస్తుండగా.. నేషనల్ క్రష్ రష్మీక మందన్న డీగ్లామరస్ రోల్ లో అభిమానుల ముందుకు రానుంది. కాగా ఇప్పటికే చిత్ర యూనిట్ అన్ని భాషల్లో ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. చెన్నై, బెంగళూర్, హైదరాబాదుల్లో ఇటీవల ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. కాగా ఇప్పటికే తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ భాషల్లో సెన్సార్ ప్రక్రియ పూర్తయింది. కానీ ఇంకా హిందీలో సెన్సార్ పూర్తికాలేదని తెలుస్తోంది.
గత చిత్రాల మాదిరిగానే డైరెక్టర్ సుకుమార్ చివరి నిమిషం వరకు ఎడిటింగ్ చేయకపోవడంతో అక్కడ సెన్సార్ ప్రక్రియకు ఆలస్యం అయిందని తెలుస్తోంది. దీంతో చిత్ర యూనిట్ హడావుడిగా ముంబైలో సెన్సార్ ప్రక్రియ పూర్తి చేస్తుందని సమాచారం. ఇవ్వాలే సెన్సార్ పూర్తయి.. సభ్యులు సినిమాను చూసి సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే ఒక వేళ సెన్సార్ పూర్తికాకపోతే హిందీలో విడుదలయ్యే అవకాశం ఆలస్యం కావచ్చనే అభిప్రాయం కూడా ఉంది.
కాగా పుష్పకు దక్షిణాది భాషల్లో పిచ్చ క్రేజ్ ఏర్పడగా.. హిందీలో మాత్రం అనుకున్నంతగా స్పందన రావడం లేదని సమాచారం. అక్కడ టికెట్ల అమ్మకాలు కూడా పెద్దగా సాగలేదని తెలుస్తోంది. ఇతర భాషల్లో మాత్రం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ సినిమాను తమిళ్ లో లైకా ప్రొడక్షన్స్, కన్నడలో స్వాగత్ ఎంటర్ప్రైజెస్ రిలీజ్ చేస్తుండగా… హిందీలో ఏఏ ఫిల్మీంస్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. గతంలో బహుబలిని కూడా ఇదే సంస్థ పంపిణీ చేసింది. మరో వైపు ఈ రోజు హైదరాబాద్ కూకట్ పల్లిలోని మల్లికార్జున, భ్రమరాంబలో పుష్ప బెనిఫిట్ షోలు వేస్తున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…