Naga Chaitanya: బ్యాచిలర్ పార్టీ గురించి బోల్డ్ కామెంట్స్ చేసిన చైతన్య.. ఆ సమయంలో బట్టలు కూడా ఉండవు?
Naga Chaitanya: టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య విడాకుల తర్వాత ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇప్పటికే ఈయన లవ్ స్టోరీ బంగార్రాజు వంటి సినిమాలతో వరుస విజయాలను అందుకోగా తాజాగా థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
విక్రమ్ దర్శకత్వంలో నాగచైతన్య రాశిఖన్నా జంటగా ఈ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా విడుదల తేది ఖరారు కావడంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య, రాశి ఖన్నా యాంకర్ అడిగే ప్రశ్నలకు తమదైన శైలిలో సమాధానం చెప్పారు.
ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అంటూ కొన్ని ప్రశ్నలను యాంకర్ ప్రశ్నలు వేశారు వీటికి వీరిద్దరూ తమదైన శైలిలో సమాధానం చెప్పారు. ఇకపోతే యాంకర్ వీరిని ప్రశ్నిస్తూ బ్యాచిలర్ పార్టీలో ఎక్కువగా జరిగే మూడు విషయాల గురించి చెప్పమని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు హీరోయిన్ సమాధానం చెబుతూ ఇంకేముంటుంది ముందు డ్రింక్ చేయడం, డాన్స్ ఫన్ అని సమాధానం చెప్పింది.ఇదే ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ కాస్త బోల్డ్ కామెంట్స్ చేశారు.
ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ అలాంటి పార్టీలలో ఒంటిపై బట్టలు ఉండవు, బాటిల్స్ అన్ని ఖాళీ అవుతాయి, ఎవరికి నిద్ర ఉండదు.. ఒకవేళ ఎవరైనా నిద్రపోవాలి అనుకున్న నిద్రపోనివ్వరు అంటూ బోల్డ్ సమాధానం చెప్పారు.ఇలా నాగచైతన్య సమాధానం చెప్పడంతో రాశిఖన్నా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…