మెగాహీరో నాగబాబు గారాల కూతురు నిహారిక తెలుగులో హీరోయిన్ గా ఇప్పటి వరకు “ఒక మనసు”, “హ్యాపీ వెడ్డింగ్” , “సూర్యకాంతం” వంటి సినిమాల్లో అద్భుతంగా నటించినప్పటికీ ఆశించినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. అలాగే కొన్ని వెబ్ సిరీస్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మెగా డాటర్ నిహారికకు జొన్నల గడ్డ చైతన్యతో గతేడాది డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ కోటలో అంగరంగ వైభవంగా వివాహం జరిగిన విషయం అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో సెలబ్రిటీలంతా ఇంటిపట్టునే ఉంటున్నారు. స్టే హోమ్, స్టే సేఫ్ అనే నినాదమిస్తూ ఏ ఒక్కరూ గడపదాటి బయటకు రావడంలేదు. ఈ నేపథ్యంలోనే మెగా డాటర్ నిహారిక భర్త చైతన్య తో ఇంట్లోనే పూర్తి సమయాన్ని గడుపుతోంది.తాజాగా చైతన్య నిహారిక కోసం చోరిజో స్పానిష్ రైస్ అనే డిష్‌ను స్వయంగా తన చేత్తో వండి తినిపించాడు.
దీనికి సంబంధించిన ఫోటోలను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకొని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.అలాగే అభిమానులు అందరూ కరోనా జాగ్రత్తలు పాటించి ఇంట్లోనే ఉండాలని సూచిస్తోంది. నిహారిక తన వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతూనే వృత్తిపరంగా నటిగా రాణించాలని భావిస్తోందట.పెళ్లి తర్వాత ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిహారిక ఇటీవలె ఓ సినిమాలో నటిస్తోందని సమాచారం.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…