నిహారిక కోసం వంట చేసిన తన భర్త చైతన్య.. వీడియో వైరల్!

0
110

మెగాహీరో నాగబాబు గారాల కూతురు నిహారిక తెలుగులో హీరోయిన్ గా ఇప్పటి వరకు “ఒక మనసు”, “హ్యాపీ వెడ్డింగ్” , “సూర్యకాంతం” వంటి సినిమాల్లో అద్భుతంగా నటించినప్పటికీ ఆశించినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. అలాగే కొన్ని వెబ్ సిరీస్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మెగా డాటర్ నిహారికకు జొన్నల గడ్డ చైతన్యతో గతేడాది డిసెంబర్‌ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ కోటలో అంగరంగ వైభవంగా వివాహం జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో సెలబ్రిటీలంతా ఇంటిపట్టునే ఉంటున్నారు. స్టే హోమ్, స్టే సేఫ్ అనే నినాదమిస్తూ ఏ ఒక్కరూ గడపదాటి బయటకు రావడంలేదు. ఈ నేపథ్యంలోనే మెగా డాటర్ నిహారిక భర్త చైతన్య తో ఇంట్లోనే పూర్తి సమయాన్ని గడుపుతోంది.తాజాగా చైతన్య నిహారిక కోసం చోరిజో స్పానిష్ రైస్‌ అనే డిష్‌ను స్వయంగా తన చేత్తో వండి తినిపించాడు.

దీనికి సంబంధించిన ఫోటోలను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకొని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.అలాగే అభిమానులు అందరూ కరోనా జాగ్రత్తలు పాటించి ఇంట్లోనే ఉండాలని సూచిస్తోంది. నిహారిక తన వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతూనే వృత్తిపరంగా నటిగా రాణించాలని భావిస్తోందట.పెళ్లి తర్వాత ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నిహారిక ఇటీవలె ఓ సినిమాలో నటిస్తోందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here