Chalaki Chanti : జబర్దస్త్ కంటే ముందే సినిమాల్లో కనిపించిన చంటి సినిమాలతో కంటే జబర్దస్త్ తోనే బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎస్ఎమ్ఎస్, కబడ్డీ జట్టు, ప్రేమకావాలి వంటి సినిమాలతో ఇండస్ట్రీ లో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నా ఆ తరువాత మాత్రం అవకాశాలు అంతగా పలకరించలేదు. కానీ జబర్దస్త్ అవకాశం జీవితాన్ని మార్చేసిందంటూ చెప్పిన చంటి ప్రస్తుతం బిగ్ బాస్ కి వెళ్ళబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.
ఇండస్ట్రీ లో చాలా కష్టాలు ఎదుర్కొన్నాను…
ఇండస్ట్రీ లో మొదట చాలా కష్టాలు పడినట్లు చలాకి చంటి తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. ఎస్ఎమ్ఎస్ వంటి సినిమాల్లో నటనకు మంచి మార్కులు పడినా వరుసగా హీరో ఫ్రెండ్ అవకాశాలు వచ్చాయి. అవి చేసి ఆ సినిమాలు మంచి హిట్ అయినా కూడా ఆ తరువాత అవకాశాలు రాలేదు. చాలా మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్ల చుట్టూ తిరిగిన డేట్స్ తీసుకో అంటారు కానీ అవకాశాలు మాత్రం ఇవ్వలేదు. అలా చాలా సార్లు జరిగింది. ఇక జబర్దస్త్ మాత్రమే అలాంటి సమయంలో నన్ను నిలబెట్టింది.
మల్లెమాల నాకు అన్నీ ఇచ్చింది…
అంతకు ముందు సినిమాల్లో గుర్తింపు వచ్చినా నన్ను ప్రేక్షకులకు దగ్గర చేసింది మాత్రం మల్లె మాల సంస్థనే. నేను కొన్న ఇల్లు, కారు, వేసుకున్న బట్టలు అన్నీ మల్లేమాల ఇచ్చినవే. నాకు ఒక గుర్తింపునిచ్చి నా కెరీర్ ను నిలబెట్టింది మల్లెమాల సంస్థంటూ చంటి చెప్పాడు. ప్రస్తుతం అడపా దడపా సినిమాల్లో చేస్తున్న చంటి బెస్ట్ కపుల్ అనే సినిమా లో కీలక పాత్రలో నటించాడు. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ల్లో పాల్గొని జబర్దస్త్ గురించి స్పందించాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…