Featured

Vidadala Rajini : టీడీపీ లోకి విడదల రజినీ.. బాలకృష్ణతో భేటీ వెనుక సంచలన విషయాలు బయటపెట్టిన పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాసరావు..

Vidadala Rajini : ఇప్పటి పాలిటిక్స్.. నిన్న ఒక పార్టీ ని తెగ విమర్శించి ఈరోజు అదే పార్టీ లోకి జంప్ అయ్యి నిన్న తిట్టిన నాయకుడినే నేడు పొగడడం చూస్తూనే ఉన్నాం. ఈ జంపింగులు పాలిటిక్స్ లో కామన్ అయిపోయాయి. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఆ పార్టీ, ఈ పార్టీ అని లేకుండా అని పార్టీలను చుట్టేస్తూ అధికారం ఏ పార్టీది అయితే ఆ పార్టీలోకి వాలిపోతున్నారు. ఇంతకు ముందు రాజకీయాల్లో సిద్ధాంతాల ప్రకారం ఏ పార్టీ మనకు నచ్చుతుందో అందులోకి వెళ్ళేవారు. రాజకీయ జీవితమంతా ఒకే పార్టీలో ఉండేవారు. అయితే ప్రస్తుతం అలా రాజకీయ వ్యవస్థ లేదు. అనుకూలతను బట్టి పార్టీ మారిపోతు ఉంటారు.

వైసీపీ నుండి టీడీపీ లోకి జింప్ అవ్వబోతున్న విడదల రజనీ…

మొదటి సారి ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి అయిన చిలకులూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆమె పార్టీ మారుతోంది టీడీపీ కి జంప్ అవ్వబోతోంది అనే ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పూల గుచ్చన్ని ఇస్తూ ఉన్న ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక ఈవిషయాన్ని అనలిస్ట్ శ్రీనివాసరావుగారు విశ్లేషించారు. అయితే విడదల రజనీ బాలకృష్ణ తో ఉన్న ఫోటో మార్ఫింగ్ అని విజయ సాయి రెడ్డి తో ఉన్న ఫోటో ను అలా మార్ఫింగ్ చేసారని టీడీపీ వాళ్ళు ఇలానే గోరంట్ల మాధవ్ ఫోటో కూడా చేశారంటూ కొంతమంది వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు.

ఇక వీటిపై శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఆమె మొదట టీడీపీ ఆ తరువాత మునుపటి ఎలక్షన్ టైములో వైసీపీ లోకి చేరి ఎమ్మెల్యే అయింది. మంత్రి గా ఉన్న తాను పార్టీ మారాల్సిన అవసరం లేదు. అయితే ఇది మార్ఫింగ్ ఒకవేళ చేసినా అది టీడీపీ వాళ్ళే చేసుంటారు అనడానికి లేదు, వైసీపీ లో ఆమె అంటే గిట్టని వాళ్ళు కుడా చేసిండొచ్చు చెప్పలేం కదా. ఆమెకు తొలిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి పదవి వచ్చింది కాబట్టి ఆమె పై అక్కసు ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. కాబట్టి వాస్తవాలు తెలియాలి, తెలియకుండా టీడీపీ పై బురద జల్లడం కరెక్ట్ కాదు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago