Champions trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్స్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన సంగతి మనకు తెలిసిందే .న్యూజిలాండ్ ఇండియా మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఈ పోటీలో భారత్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని కప్పు గెలిచారు. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కారణంగా పాకిస్తాన్ కి వందల కోట్లు నష్టం వచ్చిందని తెలుస్తోంది. అది కూడా కేవలం మన టీం ఇండియా పాకిస్తాన్ వెళ్లి మ్యాచ్ ఆడకపోవటం వల్లనే భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయని సమాచారం.
నిజానికి 29 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ కు ఓ ఐసీసీ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కింది. కానీ భారత్ కారణంగా టోర్నీ అక్కడ పూర్తి చేయలేకపోయారు.పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సంబంధాలు బాగాలేకపోవడంతో క్రికెట్ సంబంధాలు కూడా దెబ్బతిన్నారు.దీంతో పాక్ లో పర్యటించడం కోసం టీం ఇండియాకు అనుమతి రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో దుబాయిలో నిర్వహించాల్సి వచ్చింది.
టీమిండియా ఆడిన లీగ్,సెమీ ఫైనల్,ఫైనల్ మ్యాచ్ దుబాయ్ లో జరిగాయి. ఈ మ్యాచ్ లన్ని కూడా పాకిస్తాన్లో జరగాల్సి ఉండగా ఇండియా వారికి అక్కడ అనుమతి లేకపోవడంతో దుబాయిలో జరిగాయి తద్వారా పాకిస్థాన్ కి చాలా నష్టాలు వచ్చాయి. పాకిస్థాన్‌లో ఉగ్రవాదం కారణంగా 1996 తర్వాత ఐసీసీ టోర్నమెంట్ జరగలేదు. 2025లో ఛాంపియన్ ట్రోఫీ నిర్వహించే అవకాశం రావడంతో తమకు మంచి ఆదాయం వస్తుందని పాకిస్తాన్లోని పలు స్టేడియాలను అద్భుతంగా ఆధునికరించి ఎన్నో వసతులను కూడా ఏర్పాటు చేశారు.
టోర్నమెంట్ కోసం పాకిస్థాన్ 64 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 558 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీనితోపాటు రవాణా చార్జెస్ అన్ని కలుపుకొని మరో 9 మిలియన్ డాలర్లను అధికంగా ఖర్చు చేశారు. అయితే ఇండియా మ్యాచ్ లు పాకిస్తాన్లో జరగకపోవడం వల్ల స్టేడియం మొత్తం ఖాళీగానే కనిపించాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్ జట్టు తన దేశంలో రెండే మ్యాచ్‌లు ఆడింది. మిగతావన్నీ దుబాయిలో ఆడటం వల్ల కనీసం వారు పెట్టిన పెట్టుబడికి కూడా ఆదాయం రాకుండా పోయిందని తెలుస్తుంది.
ఇలా ఇండియా పాకిస్తాన్లో అడుగుపెట్టకుండానే పాక్ ను చిత్తుచిత్తుగా ఓడించింది అలాగే ఇండియాతో జరిగే మ్యాచ్ లు పాకిస్తాన్లో జరగకపోవడం వల్ల పాకిస్థాన్‌కు దాదాపు 195 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇలా ఇండియా పాకిస్తాన్ అడుగు పెట్టకపోవడం వల్లే ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని తెలుస్తోంది.
Latest Videos:
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…