చందమామ సినిమాలో హీరోయిన్ ఎంత మారిపోయింది చూస్తే అస్సలు నమ్మలేరు…!!

కృష్ణవంశీ దర్శకత్వం వహించిన చందమామ సినిమా ఎవరైనా మర్చిపోగలరా.. కాజల్ సింధు మీనన్ నటనతో మరియు అందాలతో సినిమా సూపర్ హిట్ అయ్యిందండంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఈ సినిమాలో కాజల్ ని మించి సింధు మీనన్ నాభి అందాలతో పెర్ఫార్మ్ చేసి మెస్మరైజ్ చేసింది. ఈ సినిమా మినహా మిగతా అన్ని సినిమాల్లో హోమ్లీ పాత్రల్లో నటిస్తూ పక్కింటి అమ్మాయి లాగ కనిపించింది సింధు మీనన్.

1994లో చైల్డ్ ఆర్టిస్ట్ గా రష్మీ అనే కన్నడ సినిమా పరిశ్రమలో కెరీర్ మొదలు పెట్టిన సింధు నలభై వరకు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగు, తమిళ కన్నడ, మలయాళీ సినిమాల్లో మెరిసిన ఈ అమ్మడు అన్ని భాషలు అలవోకగా మాట్లాడగలదు. స్వతహాగా మలయాళీ అయినా పుట్టి పెరిగింది మాత్రం బెంగుళూరు లోనే. చదువులు కూడా అక్కడే పూర్తి చేసిన సింధు 2001 లో భద్రాచలం సినిమాతో తెలుగు సినిమాలో అడుగుపెట్టింది. ఈ సినిమా విడుదల అయినా సమయానికి సింధుకి కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. ఈ సినిమా విడుదల అవ్వడానికి ముందే కన్నడలో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యింది. 13 ఏళ్ళ వయసులోనే నాలుగు కన్నడ సినిమాల్లో నటించింది. భరతనాట్యం అంటే ఎంతో ఇష్టం ఉన్న సింధు చిన్ననాటి నుండి నాట్యంలో శిక్షణ తీసుకుంది.

సింధుని ఒక ప్రోగ్రాం లో చుసిన జడ్జి ఒక దర్శకుడికి పరిచయం చేసి హీరోయిన్ గా మొదటి సినిమా ఆఫర్ ఇప్పించాడు. ఇక కొన్నేళ్ల పాటు సినిమాల్లో బిజీ గా ఉన్న సింధు ఆ తర్వాత మన తెలుగు అబ్బాయి అయినా డొమినిక్ ప్రభుని అనే ఒక టెక్కీ ని ఏప్రిల్ 2010 లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. చివరగా తెలుగులో సుభద్ర అనే సినిమాలో నటించి నటన కు గుడ్ బాయ్ చెప్పేసింది. ఇప్పుడు లండన్ లో సెటిల్ అయ్యి ఇద్దరు పిల్లలకు జన్మ ఇచ్చింది. ఒక బాబు మరియు ఒక పాపా.. ఆమె పేరు స్వెత్లానా. కానీ ఇప్పుడు మునపటి తన రూపంలో చాల మార్పులు వచ్చి గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఉంది.

ఇక పెళ్లయ్యాక అనుకోకండా ఒక చీటింగ్ కేసులో కూడా ఇరుక్కుంది సింధు. సింధు మీనన్ సోదరుడు బెంగుళూరు లో ని బ్యాంకు అఫ్ బరోడాలో ముప్పై లక్షల అప్పు తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో పూచీకత్తుగా ఉన్న సింధుపై అలాగే మనోజ్ పై కేసు నమోదు చేసారు పోలీసులు. ఇక అప్పు కోసం తనఖా పెట్టిన పత్రాలు సైతం నకిలీవి అని తేలడంతో ఇదే కేసు విషయమే సింధుని సైతం ఇండియాకి రప్పించారు. కానీ విషయం ఆ తర్వాత సర్దుమణగడంతో తిరిగి లండన్ వెళ్ళిపోయింది సింధు.

సినిమాల్లో అవకాశాల తగ్గాక కొన్ని సీరియల్స్ లోను టీవీ షోస్ లో నటించి హోస్ట్ చేసిన సింధు 2012 తర్వాత ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు. కేవలం ఫ్యామిలికి మాత్రమే ప్రియారిటీ ఇస్తూ ఒక్క టీవీ షో లో కూడా కనిపించలేదు. చివరగా శ్రీమాన్ శ్రీమతి అనే పాపులర్ తమిళ టీవీ షోకి ప్రొడ్యూసర్ గా మరియు హోస్ట్ గా వ్యవహరించింది. ఈ షో అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఇక సింధు తమ్ముడు కార్తీక్ VJ గా పనిచేసి ‘సుకుమార’, వండర్ వరల్డ్, లిఫ్ట్ కోడ్ల వంటి కన్నడ సినిమాల్లో హీరోగా నటించాడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago