Chandra Mohan: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు తమ వారసత్వంగా వారి పిల్లలను కూడా ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి ఇష్టపడతారు.ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది సీనియర్ నటినటుల పిల్లలు తమ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో అగ్ర నటీనటులుగా కొనసాగుతున్నారు. ఇకపోతే సీనియర్ నటుడు చంద్రమోహన్ గురించి అందరికీ సుపరిచితమే. ఈయన ఎన్నో సినిమాలలో హీరోగా నటించడమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన చంద్రమోహన్ ఎప్పుడూ కూడా తన ఫ్యామిలీ గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. ఇకపోతే ఈయనకు ఇద్దరు కుమార్తెలు.తన సినిమాలలో బిజీగా ఉండటం వల్ల తన పిల్లలతో సమయం గడపడానికి కూడా వీలు లేకుండా పోయిందని చంద్రమోహన్ ఎన్నో సందర్భాలలో వెల్లడించారు. తన పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేయకపోవడానికి కారణాలను తెలియజేశారు.
తాను సినిమా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడ్డాను అలా తన పిల్లలు కష్టపడకూడదని భావించి వారిని సినిమా ఇండస్ట్రీకి దూరం పెట్టానని చంద్రమోహన్ వెల్లడించారు. అయితే తన ఇద్దరు కూతుర్లు చదువులో మంచిగా రానించి గోల్డ్ మెడల్ సంపాదించారని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన పేర్కొన్నారు. ఇకపోతే చంద్రమోహన్ సోదరుడు కుమార్తె మాత్రం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ సినిమాలో నటించారు.
చంద్రమోహన్ తమ్ముడు కుమార్తె మంచి క్లాసికల్ డాన్సర్. ఈమె ఓ ప్రదర్శనలో భాగంగా తన క్లాసికల్ డాన్స్ పర్ఫామెన్స్ చూసిన దర్శకుడు కె విశ్వనాథ్ తాను చేయబోయే సినిమాలో హీరోయిన్ గా నటించమని అడిగారట.కే విశ్వనాథ్ గారు పెద్ద దర్శకుడు మంచి కథ పాత్ర కావడంతో చంద్రమోహన్ కూడా తన సోదరుడు కుమార్తె సబితను ప్రోత్సహించడంతో ఆమె సప్తపది సినిమాలో నటించారు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఆమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే సబిత వాటిని ఎంతో సున్నితంగా రిజెక్ట్ చేసి తన చదువుపై దృష్టి పెట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…