Actress Rameswari : దక్షిణాది సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సెలెబ్రెటీలు కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తమ సత్తా ఏంటో నిరూపించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఈ క్రమంలోనే ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో తాళ్లూరి రామేశ్వరీ ఒకరు. అచ్చ తెలుగు ఆడపిల్ల అయినటువంటి ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన గుర్తింపు పొందారు.
తెలుగులో ఈమె కేవలం రెండే రెండు సినిమాలలో నటించారు. సీతామాలక్ష్మి, చిన్నోడు పెద్దోడు అనే సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఇలా ఈమె తెలుగులో హీరోయిన్ గా కేవలం రెండు సినిమాలలో నటించిన బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం వరుస సినిమాలలో నటిస్తూ అగ్రతారగ పేరు సంపాదించుకున్నారు. ఇకపోతే ఈమె తెలుగులో నటించిన సీతామాలక్ష్మి సినిమాకి ఏకంగా నంది అవార్డు కూడా అందుకున్నారు.
ఈ విధంగా తెలుగులో నంది అవార్డు అందుకున్నప్పటికీ ఈమె తెలుగు సినిమాలపై ఆసక్తి కనపరచలేదు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఈమె దుల్హన్ వోహీ జో పియా మన్ భాయే’, అగ్ని పరీక్ష, ఆదత్ సే మజ్‌బూర్, ఆస్ ఔర్ ప్యాస్, అంధేరా ఉజాలా, వక్త్ వక్త్ కీ రాత్ వంటి వరుస హిట్ సినిమాలలో నటించడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె పేరు మారు మోగిపోయింది. ఇలా అగ్రతారగా పేరు సంపాదించుకున్న రామేశ్వరి తన చిన్ననాటి స్నేహితుడు దీపక్ సేథ్ ను పెళ్లాడిన ఆమెకు ఇద్దరు కుమారులు.
ఈ విధంగా కుటుంబ బాధ్యతలను చూసుకోవడం కోసం ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇకపోతే 2002వ సంవత్సరంలో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రామేశ్వరి 2003వ సంవత్సరంలో మహేష్ బాబు తేజ కాంబినేషన్లు వచ్చిన నిజం సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్రలో నటించారు.అదేవిధంగా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించారు. జీ తెలుగులో ప్రసారమైన అమెరికా అమ్మాయి అనే సీరియల్ లో ఈమె నటించి మరోసారి తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…