Movie News

ఆ పాన్ ఇండియా హీరోని టార్గెట్ చేసిన ‘చెక్’ దర్శకుడు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న విలక్షణ దర్శకుల్లో చంద్రశేఖర్ యేలేటి ఒకరు.. అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం, మనమంతా లాంటి విభిన్నమైన చిత్రాలను అందించి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ దర్శకుడు..ఐతే ఈ సినిమాల్లో ఎక్కువగా కమర్షియల్ సక్సెస్‌లు లేకపోవడంతో ఆయన ప్రతిభకు తగ్గ అవకాశాలు రాలేదు. కెరీర్ ఎప్పుడూ అంత ఊపులో లేకపోయింది.

కొన్నేళ్ల విరామం తర్వాత యేలేటి యువ కథానాయకుడు నితిన్‌తో ‘చెక్’ అనే సినిమా తీశాడు. రిలీజ్ ముంగిట దీనికి మంచి హైపే వచ్చింది. ఈసారి యేలేటి మ్యాజిక్ వర్కవుట్ కావడంతో పాటు కమర్షియల్‌గానూ మంచి సక్సెస్ దక్కుతుందని అభిమానులు ఆశించారు. కానీ ‘చెక్’ ఏ రకంగానూ మెప్పించలేకపోయింది.అందులో యేలేటి మార్కు మిస్సయింది. సినిమా సరిగా ఆడలేదు. దీంతో ఆయన కెరీర్ మరింత తిరోగమనం అయ్యేలా కనిపించింది.

భవ్య క్రియేషన్స్‌లో ‘చెక్’ చేస్తుండగానే యేలేటికి మైత్రీ మూవీ మేకర్స్‌లో ఓ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. నిజానికి ‘చెక్’ కంటే ముందే ఈ బేనర్లో యేలేటి సినిమా చేయాల్సింది. కానీ అది వర్కవుట్ కాలేదు. ఐతే ‘చెక్’ ఫలితంతో సంబంధం లేకుండా మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు యేలేటితో సినిమా చేయడానికి సుముఖంగానే ఉన్నారు. కానీ హీరో సంగతే ఎటూ తేలలేదు. ముందు స్క్రిప్టు రెడీ చేస్తే ఆ తర్వాత హీరో సంగతి చూద్దామనుకున్నారు. ఐతే ఇప్పుడు యేలేటి కొత్త సినిమా గురించి ఓ ఆసక్తికర ప్రచారం బయటికి వచ్చింది.

ఆయన ఏకంగా ప్రభాస్‌నే టార్గెట్ చేస్తున్నాడట. అతణ్ని దృష్టిలో ఉంచుకుని ఓ కథ రాస్తున్నాడట. మైత్రీ వాళ్లకు ప్రభాస్‌తోనూ ఓ కమిట్మెంట్ ఉన్న మాట వాస్తవం.కానీ ప్రభాస్ కోసం ఎవరైనా పెద్ద డైరెక్టర్‌ను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపించారు మైత్రీ అధినేతలు. బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ పేరు సైతం వినిపించింది. అక్కడ కట్ చేస్తే ఇప్పుడు యేలేటి.. ప్రభాస్ కోసం కథ రాస్తున్నాడంటే మైత్రీ ఈ ఇద్దరికి లింకు కలుపుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఐతే యేలేటి ఇప్పటిదాకా పెద్ద స్టార్లతో సినిమాలే తీయలేదు. నితిన్ లాంటి మీడియం రేంజ్ హీరోతోనే హిట్టు కొట్టలేకపోయాడు. ఇలాంటి ట్రాక్ రికార్డున్న దర్శకుడితో సినిమా చేయడానికి ప్రభాస్ ఓకే అంటాడా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..!!

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

22 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

23 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago