ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కొవిషీల్డ్ టీకాను కూడా మనదేశంలో ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మొదటి డోసు కొవిషీల్డ్ వేసుకున్న తర్వాత 28 రోజులకు రెండవ డోస్ వేసుకోవాలని తెలిపింది.
కానీ తాజాగా రెండో డోస్ వ్యవధిని 12-16 వారాలకు పెంచొచ్చన్న నిపుణుల కమిటీ సిఫార్సులను ప్రభుత్వం అంగీకరించింది. అయితే కేవలం ఈ 12 నుంచి 16 వారాల వ్యవధి ఒక కొవిషీల్డ్ టీకాకి మాత్రమే కానీ,కొవాగ్జిన్‌కు సంబంధించి డోసుల మధ్య అంతరంలో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు.
ఈ విధంగా రెండు డోస్ ల వ్యవధి పెంచడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చునని నేషనల్ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ నిపుణుల బృందం తెలిపింది. రెండవ డోసు 28 రోజుల తర్వాత తీసుకోవడం వల్ల కేవలం 55.1 శాతం మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తుందని, ఈ డోస్ వ్యవధిని 12-16 వారాలకు పెంచడం వల్ల ఇది 81.3 సమర్థవంతంగా పనిచేస్తుందని అంతర్జాతీయ ది లాన్సెట్ పత్రిక ప్రచురించింది.
కొవిషీల్డ్ టీకా డోస్ ల మధ్య వ్యవధి పెంచడం ఇది రెండో సారి కావడం గమనార్హం.ఈ విధంగా విభజించడం వల్ల ఇది సమర్థవంతంగా పని చేస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించగా…మరి కొందరు మాత్రం వ్యాక్సిన్ కొరత కారణం వల్లనే ఈ విధంగా వ్యాక్సిన్ మధ్య వ్యవధి పెంచుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…