Featured

Character Artist Sudha : నన్ను బూతులు తిట్టాడు… ఇప్పుడు వాళ్లందరికీ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను….: నటి సుధ

Character Artist Sudha : తమిళనాడు లో జన్మించిన తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 500 పైగా సినిమాల్లో నటించారు సుధ. ఆమె అసలు పేరు హేమ సుధ. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఆ పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా తల్లి పాత్రల్లో ఎక్కువగా నటించిన సుధ తెలుగులో చాలా మంది హీరోలకు తల్లి పాత్రలో నటించారు. తన కెరీర్ కి సమబంధించిన అటుపోట్లతో పాటు ఎదురైన అవమానాలను కూడా ఆమె తాజా ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

అందరి ముందు తిట్టాడు…

తన సినిమా కెరీర్ తమిళంలో మొదలు పెట్టిన సుధ గారు అక్కడ వదిన, అక్క పాత్రలలో ఎక్కువగా నటించారు. అలా నటిస్తున్న సమయంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. తెలుగులో ముద్దుల మావయ్య గా వచ్చిన తమిళ మాతృక సినిమా ‘ఎన్ తంగచి పడిచావా’ సినిమాలో నటిస్తున్న సమయంలో ఒక పాటలో చిన్న మూమెంట్ సరిగా చేయలేక పోయినందుకు సుందరం మాస్టారు నువ్వు ప్రొస్టిట్యూషన్ కి కూడా పనికి రావు అంటూ అందరి ముందు తిట్టారట ఆ సమయంలో చాలా బాధగా అనిపించింది.

కానీ మళ్ళీ ఆయన డైరెక్షన్ లోనే సినిమాల్లో నటించినపుడు ఆయన సారీ చెప్పి చాలా బాగా నటిస్తున్నారు అని చెప్పారు అంటూ అప్పటి చేదు అనుభవాలను పంచుకున్నారు. ఇక తనను కొందరు లేడీ ఆర్టిస్టులు మేము వచ్చాక ఆమెకు అవకాశాలు తగ్గాయి అంటూ మాట్లాడారు. అలాంటి వాళ్లకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా నేను ఇప్పుడు నటిస్తున్న సినిమా మాతృదేవో భవ మారుధురి రాజా గారి సినిమా. అందులో టైటిల్ రోల్ చేస్తున్నాను. అలాంటి క్యారెక్టర్ వాళ్ళు చేయగలిగితే చాలు అంటూ సుధ ఓపెన్ ఛాలెంజ్ చేసారు.

Bhargavi

Recent Posts

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

7 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

7 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

8 hours ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

9 hours ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

10 hours ago

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…

11 hours ago